టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీకి మళ్లీ పరీక్షలు

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో మోటార్ షోలో ఆవిష్కరించిన టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. ఇప్పుడు దీనిని అత్యంత రహస్యంగా పరీక్షిస్

By Anil Kumar

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో మోటార్ షోలో ఆవిష్కరించిన టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. ఇప్పుడు దీనిని అత్యంత రహస్యంగా పరీక్షిస్తుండగా మీడియా కంటబడింది. టాటా హెచ్5ఎక్స్ 5-సీటర్ ఎస్‌యూవీ విపణిలోకి ఇటీవల విడుదలైన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తుంది.

టాటా హెచ్5ఎక్స్ అంచనా ధరలు, ఇంజన్, డిజైన్ మరియు ఫీచర్ల గురించి పూర్తి వివరాలు...

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ప్రోటోటైప్ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని పూనే రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది. డిజైన్ అంశాలను మరియు ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో కప్పేసి మరీ పరీక్షించారు.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని ఆప్టిమల్ మోడ్యూలర్ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్ ఫ్లాట్‌ఫామ్ (OMEGA) మీద నిర్మించారు. ఇందులో కండలు తిరిగిన శరీరాకృతి గల అగ్రెసివ్ మరియు స్పోర్టివ్ డిజైన్ మరియు కూపే తరహా డిజైన్ శైలిలో ఉంటుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఈ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ డిజైన్‌ను టాటా వారి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధారంగా తీర్చిదిద్దనుంది. నెక్సాన్ ఎస్‌యూవీలో గుర్తించినటువంటి సిగ్నేచర్ హ్యుమానిటీ లైన్స్ కూడా ఇందులో వస్తాయి. ప్రొడక్షన్ వెర్షన్ టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, స్కిడ్ ప్లేట్లు మరియు డ్యూయల్ టోన్ బంపర్ వంటివి ఎక్ట్సీరియర్ ఫీచర్లు రానున్నాయి.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఈ ప్రోటోటైప్ హెచ్5ఎక్స్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ప్రీమియం ఎస్‌యూవీ ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ మల్టీజెట్II డీజల్ ఇంజన్‌తో రానుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

140 మరియు 170బిహెచ్‌పి రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ జడ్ఎఫ్ కంపెనీ నుండి సేకరించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానుంది. అమెరికా లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ కూడా తమ కంపాస్ ఎస్‌యూవీలో ఇదే ఇంజన్ అందిస్తోంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ టాటా మోటార్స్ ఇండియా లైనప్‌లో అత్యంత ముఖ్యమైన మోడల్‌గా నిలవనుంది. ఇందులో రియర్ వీల్ డ్రైవ్‌తో పాటు ఆప్షనల్ ఫోర్-వీల్ డ్రైవ్ మరియు పలు డ్రైవింగ్ మోడ్‌లు రానున్నాయి. వీటితో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి పలు ప్రీమియం ఫీచర్లను టాటా ఇందులో పరిచయం చేయనుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఈ హెచ్5ఎక్స్ ప్రీమియం 5-సీటర్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి లేదా 2019 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. టాటా హెచ్5ఎక్స్ ప్రారంభ ధర రూ. 12 లక్షలు ఉండవచ్చు. ఒక్కసారి విపణిలోకి విడుదలైతే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు సరాసరి పోటీనిస్తుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్‌కు హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ అత్యంత కీలకమైనది, దీని రాకతో టాటా దశ తిరగడం ఖాయం. టాటా ప్రవేశపెట్టిన నెక్సాన్ ఎస్‌యూవీ మంచి విజయాన్ని సాధించింది. టాటా హెచ్5ఎక్స్ కూడా తన విభిన్నమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు మరియు అత్యంత సరసమైన ధరల శ్రేణి వంటి అంశాల పరంగా టాటా మోటార్స్‌కు భారీ సక్సెస్ సాధించిపెట్టనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 23, 2018, 13:51 [IST]
English summary
Read In Telugu: Tata H5X SUV Spotted Testing Again — To Rival Hyundai Creta Facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+