టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ టాటా హ్యారియర్: లాంచ్ డిటైల్స్!!

టాటా మోటార్స్ అతి త్వరలో విడుదల చేయనున్న ఎస్‌యూవీకి "హ్యారియర్" అనే పేరును ఖరారు చేసింది. టాటా మోటార్స్ గతంలో హెచ్5ఎక్స్ కోడ్ పేరుతో ఆవిష్కరించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు హ్యారియర్ పేరును పెట్టిన

By Anil Kumar

టాటా మోటార్స్ అతి త్వరలో విడుదల చేయనున్న ఎస్‌యూవీకి "హ్యారియర్" అనే పేరును ఖరారు చేసింది. టాటా మోటార్స్ గతంలో హెచ్5ఎక్స్ కోడ్ పేరుతో ఆవిష్కరించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు హ్యారియర్ పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

తాజాగా టాటా హ్యారీయర్ ఎస్‌యూవీ ఫ్రంట్ మరియు రియర్ టీజర్ ఫోటోలను రివీల్ చేసింది. దీనిని 2019లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. హ్యారియర్ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా తమ సేల్స్ నెట్‌వర్క్ పెంచుకోవాలనే ఆలోచనలో టాటా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న షోరూమ్‌లను కస్టమర్లకు ప్రీమియం ఫీల్ కలిగించేలా మార్పులు చేపట్టనుంది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. టాటా కంపెనీకి ఉన్న పూనే ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ఆలోచనలో ఉంది. టాటా మోటార్స్ ఈ హ్యారియర్ ఎస్‌యూవీని తొలుత హెచ్5ఎక్స్ కోడ్ పేరుతో 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ భాగస్వామ్యంతో రూపొందించిన ఆప్టిమల్ మోడ్యూలర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్‍‌ను ఉపయోగించి హ్యారియర్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని నిర్మించారు.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

ఏదేమైనప్పటికీ, టాటా మోటార్స్ ఈ మోడల్‌ను పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. మరియు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో దేశీయందా తయారైన విడి పరికరాలతో ఉత్పత్తి చేయనుంది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

ఏదేమైనప్పటికీ, టాటా మోటార్స్ ఈ మోడల్‌ను పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. మరియు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో దేశీయంగా తయారైన విడి పరికరాలతో ఉత్పత్తి చేయనుంది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ హెడ్ మయాంక్ పరీక్ మాట్లాడుతూ, "టాటా కస్టమర్ల కోసం సరికొత్త హ్యారియర్ ఎస్‌యూవీని పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టాటా హ్యారియర్ ఎస్‌యూవీని 2019 ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం." అని చెప్పుకొచ్చాడు.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

"ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో టాటా హ్యారియర్ అత్యంత కీలకమైన ఉత్పత్తిగా నిలవనుంది, కస్టమర్లకు మరియు ఇండియన్ మార్కెట్‌కు ఇదొక ఇంట్రెస్టింగ్ మోడల్ మాత్రమే కాకుండా, టాటా కంపెనీ బ్రాండ్ వ్యాల్యూని పెంచనుందని హ్యారియర్‌ను కొనియాడారు."

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

టాటా హెచ్5ఎక్స్ లేదా ప్రొడక్షన్ వెర్షన్ టాటా హ్యారియర్ సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్న ఇందులో బహుశా ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయమ్యే అవకాశం ఉంది.

టాటా అప్‌కమింగ్ ఎస్‌యూవీ: టాటా హ్యారియర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ తమ ఫ్లాగ్‌షిప్ మరియు లగ్జరీ ఎస్‌యూవీకి హ్యారియర్ పేరును అధికారికంగా ఖరారు చేసింది. గతంలో దీనిని హెచ్5ఎక్స్ పేరుతో పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద అత్యంత కఠినమైన పరీక్షలు జరిపింది. 2019 ప్రారంభంలో విడుదల కానున్న టాటా హ్యారియర్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Harrier Name Confirmed For Upcoming H5X SUV
Story first published: Wednesday, July 11, 2018, 18:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X