భారీ సేల్స్‌తో దుమ్ములేపిన టాటా మోటార్స్
అత్యంత దారుణమైన పరిస్థితిలో సరిగ్గా రెండేళ్ల క్రితం చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా టాటా సేల్స్ ఫలితాలు అనూహ్యంగా పెరిగిపో
భారతీయులకు ఆటోమొబైల్స్ పరిచయం చేసిన అతి పురాతణ కంపెనీలలో టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్స్ ప్రాణం పోసుకున్నప్పుడు మంచి ఫలితాలనే కనబరచింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలం పాటు దేశీయ విపణిలోకి ప్రవేశించిన కంపెనీల కారణంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో పట్టును కోల్పోయింది.

అత్యంత దారుణమైన పరిస్థితిలో సరిగ్గా రెండేళ్ల క్రితం చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా టాటా సేల్స్ ఫలితాలు అనూహ్యంగా పెరిగిపోయాయి.

గత ఏడాది ఏప్రిల్ నెలలో 16,017 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 32,266 యూనిట్లను విక్రయించి ఏకంగా 126 శాతం వృద్దిని సాధించింది. ఇది నిజంగా టాటాకు ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు.

ఈ ఫలితాలతో టాటా మోటార్స్ ఇప్పుడు మరింత వ్యూహాత్మకమైన ఉత్పత్తులను సిద్దం చేస్తోంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల నుండి అత్యంత ఖరీదైన ప్రీమియం మోడళ్ల వరకు అన్ని సెగ్మెంట్లలో అత్యంత ప్రభావంతమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.

ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల దేశీయ అమ్మకాల పరంగా చూసుకుంటే గత ఏడాది ఏప్రిల్‌లో 28,844 యూనిట్లను విక్రయించిన టాటా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 53,511 యూనిట్లను విక్రయించి 86 శాతం వృద్దిని సాధించింది.

టాటా మోటార్స్‌కు దేశీయ విపణిలో ప్యాసింజర్ కార్ల విభాగం అత్యంత ముఖ్యమైది. అయినప్పటికీ, ఇందులో అత్యధిక సేల్స్ వాణిజ్య విభాగం నుండి సాధ్యమయ్యాయి. భారత్ బెంజ్ వంటి దిగ్గజం సంస్థలను ఎదుర్కుని అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది.

కేవలం ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పరంగా చూసుకుంటే ఏప్రిల్ 2017లో 12,827 యూనిట్లు అమ్ముడుపోగా... ఏప్రిల్ 2018లో 17,235 యూనిట్లను విక్రయించి 34 శాతం వృద్దని నమోదు చేసుకుంది. టాటా విడుదల చేసిన టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హెక్సా వంటి మోడళ్ల విడుదలతో టాటా సేల్స్ అమాంతం ఊపందుకున్నాయి. 3010 యూనిట్ల ఎగుమతితో 41 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టాటా మోటార్స్ ప్రస్తుతం డీలర్‌షిప్ నెట్‌వర్క్ విస్తరించకునే ఆలోచనలో ఉంది. రూరల్ కస్టమర్లను చేరుకునేందుకు ఈ ఏడాది చివరి నాటికి 100 కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని భావిస్తోంది.

అన్ని రకాల కార్ల ప్రేమికులను చేరుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను టాటా అందిపుచ్చుకుంటోంది. క్రికెట్ ప్రేమికులను ఆకర్షించేందుకు టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో మూడేళ్ల పాటు ఐపిఎల్ అఫీషియల్ కారుగా ఒప్పందం కుదుర్చుకుంది.

అంతే కాకుండా, ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి మారుతి బాలెనోకు పోటీగా 45ఎక్స్ కారును సిద్దం చేస్తోంది. అదే విధంగా హెచ్5ఎక్స్ అనే 5 మరియు 7 సీటర్ ప్రీమియం ఎస్‌యూవీలను సిద్దం చేస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హెక్సా మోడళ్లు టాటా భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు భారతదేశపు మూడవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణించేందుకు ప్రయాణిస్తోంది. ఇందుకు ఇంపాక్ట్ డిజైన్ ఫిలాఫీ 2.0 వెర్షన్ ఆధారంగా రూపొందించిన హెచ్5ఎక్స్ మరియు 45ఎక్స్ మోడళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. ఏదేమైనప్పటికీ, టాటా ఫలితాలతో కస్టమర్లు నూతనత్వాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








