అన్ని కార్ల మీద భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్

Written By:

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియా లైనప్‌లో ఉన్న దాదాపు అన్ని మోడళ్ల మీద ధరలు పెంచింది. వివిధ రకాల మోడళ్ల ఆధారంగా గరిష్టంగా రూ. 60,000 వరకు ధరలు పెంపు చేపట్టింది. ధరల పెంపు అనంతరం సవరించబడిన కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి.

టాటా కార్ల మీద భారీగా పెరిగిన ధరలు

పెట్టుబడి వ్యయం పెరగడం మరియు మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ధరలు పెంచినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏయే మోడల్ మీద ఎంత మేరకు ధరలు పెరిగాయనే వివరాలను వెల్లడించలేదు. అయితే, విపణిలో ఉన్న ప్రతి మోడల్ మీద ప్రస్తుత ధరలతో పోల్చితే ఖచ్చితమైన పెంపు ఉంటుందని తెలిసింది.

టాటా కార్ల మీద భారీగా పెరిగిన ధరలు

టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ మాట్లాడుతూ, "పెట్టుబడి భారం పెరగడం, మార్కెట్ పరిస్థితుల్లో ఒడిదుడుకులు మరియు పలు ఆర్థిక అంశాల అసమానతల కారణంగా ధరల పెంపు అనివార్యమైందని పేర్కొన్నాడు."

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
టాటా కార్ల మీద భారీగా పెరిగిన ధరలు

టాటా మోటార్స్ గత రెండేళ్ల కాలంలో టియాగో హ్యాచ్‌బ్యాక్, హెక్సా క్రాసోవర్ ఎస్‌యూవీ, టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్ మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లను లాంచ్ చేసింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నిర్మించిన ఈ నాలుగు మోడళ్లకు టాటా భారీ విజయాన్ని సాధించిపెట్టాయి.

టాటా కార్ల మీద భారీగా పెరిగిన ధరలు

ప్రస్తుతం టాటా ఇండియా లైనప్‌లో నానో, టియాగో, ఇండికా, ఇండిగో ఇసిఎస్, సుమో గోల్డ్, బోల్ట్, జెస్ట్, టిగోర్, నెక్సాన్, హెక్సా మరియు టాటా సఫారీ స్టార్మ్ వంటి మోడళ్లు ఉన్నాయి.

టాటా కార్ల మీద భారీగా పెరిగిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతానికి ధరల పెంపు గురించి ప్రకటన మాత్రమే విడుదల చేసింది. వేరియంట్ల వారీగా ఏయే మోడల్ మీద ఎంత వరకు ధరల పెంపు ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరియు పోటీని ఎదుర్కునేలా అత్యంత చాకచక్యంగా ధరల పెంపు చేపట్టనుంది. టాటా ఇండియా లైనప్‌లో ఉన్న హెక్సా ఎస్‌యూవీ మీద గరిష్ట పెంపు ఉండవచ్చు. మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: Tata Motors Hike Prices Of its Entire Passenger Vehicle Lineup
Story first published: Tuesday, March 20, 2018, 18:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark