అన్ని కార్ల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించిన టాటా మోటార్స్

టాటా గ్రూపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాటా మోటార్స్ తమ అన్ని కార్లు మరియు ఎస్‌యూవీల మీద గరిష్టంగా లక్ష రుపాయల విలువైన పరిమిత కాలపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

By Anil Kumar

టాటా గ్రూపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాటా మోటార్స్ తమ అన్ని కార్లు మరియు ఎస్‌యూవీల మీద గరిష్టంగా లక్ష రుపాయల విలువైన పరిమిత కాలపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

అంతే కాకుండా, ఈ కాలంలో టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు కేవలం రూ. 1 తోనే ఇన్సూరెన్స్ మరియు అదనపు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్లు, టాటా మోటార్స్ ఇటీవల పరిచయం చేసిన నెక్సాన్, హెక్సా, టిగోర్ మరియు టియాగో వంటి అన్ని కొత్త కార్ల మీద లభ్యమవుతున్నాయి. అయితే, జూన్ 25 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

టాటా ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హెక్సా. అయితే, టాటా ఇప్పటి వరకు వీటి మీద ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. కానీ తొలిసారిగా భారీ మొత్తంలో ఆఫర్లు తీసుకొచ్చింది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

ఈ సందర్భంగా టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ మరియు సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ బర్మన్ మాట్లాడుతూ, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఎన్నో ఏళ్ల నుండి శ్రమిస్తోంది. టాటా గ్రూప్ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లతో సంతోషాల భాందవ్యాన్ని ఏర్పరుచుకునేందుకు అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్ర స్థానమే లక్ష్యంగా టాటా మోటార్స్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో సరిగ్గా రెండేళ్ల క్రితం పాత మోడళ్ల ప్రక్షాళన చేపట్టి, వాటి స్థానంలో అత్యంత శక్తివంతమైన, నూతన ఫీచర్లతో మరియు బడ్జెట్ ధరతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ప్రారంభించింది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

టాటా అతి త్వరలో 45ఎక్స్ అనే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరియు హెచ్5ఎక్స్ అనే ప్రీమియం ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేస్తోంది. ఈ రెండు మోడళ్లను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

అంతే కాకుండా, టియాగో మరియు టిగోర్ యొక్క పర్ఫామెన్స్ వెర్షన్‌లు అయిన టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడళ్లను విడుదల చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. ఈ రెండింటినీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అభివృద్ది చేస్తోంది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 మోడళ్లకు గట్టి పోటీగా గత ఏడాది విడుదల నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ సరిగ్గా రెండేళ్ల క్రితం ఆశించిన విక్రయాలు లేక దివాళాతీసే పరిస్థితుల్లో ఉండేది. అయితే, అనూహ్యంగా తెరమీదకు వచ్చిన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా మార్కెట్లోకి వచ్చిన టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హెక్సా మోడళ్లతో టాటాకు పూర్వ వైభవం వచ్చింది.

టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు

దాంతో వీలైనంత వరకు ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు టాటా గ్రూప్ 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నడూ లేని విధంగా తమ పాపులర్ కార్ల మీద ఏకంగా లక్ష రుపాయల వరకు ప్రయోజనాలను ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 12, 2018, 15:54 [IST]
English summary
Read In Telugu: Tata Motors offering discounts of up to Rs. 1 lakh on Nexon, Tiago, Tigor & more cars in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+