మారుతి, హ్యుందాయ్ కంపెనీలకు చుక్కలు చూపించనున్న టాటా మోటార్స్

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో ఫిబ్రవరి రెండవ వారం నుండి ప్రారంభం కానుంది. ఈ ఆటో ఎక్స్-పో షో వేదికగా టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్ల తొలి ఆవిష్కరణ చేయడానికి సిద్దమైంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ లాగ్వేంజ్ 2.0 వెర్షన్‌ను 2018 ఆటో ఎక్స్-పో లో ఆవిష్కృతం చేయనునుంది. ఈ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వస్తున్న ఎన్నో కొత్త కాన్సెప్ట్ కార్లను ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమ కోసం రివీల్ చేయనుంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

ఎలాంటి కార్లను, ఏయే సెగ్మెంట్లలో తమ కొత్త కార్లు ఉంటాయనేదాని గురించి టాటా ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, టాటా రహస్యంగా ఎక్స్451 అనే కోడ్ పేరుతో నూతన హ్యాచ్‌బ్యాక్ కారును పరీక్షిస్తున్నట్లు తెలిసింది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా రూపొందించిన అడ్వాన్స్‌డ్ మోడ్యూలర్ ఫ్లాట్‌ఫామ్(AMP) ఆధారంగా అభివృద్ది చేసిన తొలి హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఎక్స్451. టాటా మోటార్స్ ఇక మీదట తమ అన్ని స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను AMP ఆధారంగానే డెవలప్ చేయనున్నట్లు తెలిసింది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా బృందం అభివృద్ది చేస్తున్న హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న టియాగో పై స్థానాన్ని భర్తీ చేస్తుంది. టాటా వారి మొట్టమొదటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలవనున్న ఇది, మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోటీపడనుంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

సరికొత్త టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించబడుతూ, పట్టుబడింది. ఈ ఆటో ఎక్స్-పో ను దృష్టిలో పెట్టుకునే డెవలుప్ చేసింది కాబట్టి దాదాపు ప్రొడక్షన్ వెర్షన్ ఎక్స్451 మోడల్‌ను ఒకేసారి ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌‌తో పాటు క్యూ501(Q501) అనే కోడ్ పేరుతో కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా అభివృద్ది చేస్తోంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని నిర్మించిన ఫ్లాట్‌ఫామ్ మీద టాటా డిజైనింగ్ బృందం దీనిని డెవలప్ చేస్తోంది.

Trending On DriveSpark Telugu:

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో ప్రయాణికులంతా సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?

భారత్‌లో అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

ఈ రెండింటితో పాటు పర్ఫామెన్స్ హ్యచ్‌బ్యాక్ కారును కూడా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. టియాగో హ్యాచ్‌బ్యాక్ కారునే స్పోర్ట్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ ఇంజన్ అందించి ఆటో ఎక్స్-పో లో ఆవిష్కరించే అవకాశం ఉంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్‌ కారులో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీలో అందించిన 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451ను ఇదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేసే డీజల్ ఇంజన్‌తో పరిచయం చేయనుంది. 2018 ఫిబ్రవరిలో ఆవిష్కరించి 2019 నాటికి పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దం చేయనుంది.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు బెస్ట్ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా దూసుకెళ్లేందుకు టాటా మోటార్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ మోటార్స్ ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో వరుసగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు విక్రయిస్తున్న ప్రతి మోడల్‌కు పోటీని బడ్జెట్ ధరలో టాటా అందుబాటులోకి తీసుకొస్తే రాణించడం పెద్ద కష్టమేమీ కాదు.

2018లో వస్తున్న టాటా కొత్త కార్లు

రానున్న రెండేళ్లలో విభిన్న సెగ్మెంట్లో విరివిగా విడుదల చేయడానికి సిద్దం చేసుకున్న కార్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించి, తరువాత సందర్భానుకూలంగా విపణిలోకి లాంచ్ చేయనుంది. ఇందుకోసం సరికొత్త 2.0 వెర్షన్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగిస్తోంది. మొత్తానికి ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో టాటా మోటార్స్ తనదైన ముద్ర వేసుకుంటోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Tata Motors To Reveal Impact Design Language 2.0 At Auto Expo 2018; Premium Hatchback In The Works?
Story first published: Wednesday, January 10, 2018, 11:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark