ఇండికా మరియు ఇండిగో కార్ల ఉత్పత్తిని నిలిపేసిన టాటా మోటార్స్

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ ఇండిగో కాంపాక్ట్ సెడాన్ మరియు ఇండికా కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రొడక్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది.

By Anil Kumar

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ ఇండిగో కాంపాక్ట్ సెడాన్ మరియు ఇండికా కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రొడక్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. ఇతర మోడళ్ల నుండి గట్టి పోటీ మరియు తక్కువగా నమోదవుతున్న సేల్స్ కారణంగా ఇండికా మరియు ఇండిగో కార్ల అభివృద్ది మరియు తయారీకి శాశ్వతంగా ముగింపు పలికినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు సర్వీస్ సపోర్ట్ ఇవ్వనుంది. అదే విధంగా ఈ రెండు కార్లకు అవసరమయ్యే విడి భాగాలను అందుబాటులో ఉంచనుంది.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

దీని గురించి ఓ టాటా మోటార్స్ డీలర్ స్పందిస్తూ, "కంపెనీ ప్రస్తుతం ఇండిగో మరియు ఇండికా కార్ల తయారీని నిలిపేసింది. ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న కార్లను మాత్రమే సరఫరా చేస్తున్నట్లు వివరించాడు."

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వెల్లడించిన సేల్స్ మరియు ప్రొడక్షన్ వివరాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. ఇండిగో మరియు ఇండికా సేల్స్ దారుణంగా పడిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

2016-17 ఆర్థిక సంవత్సరంలో 153,151యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్ 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 187,321 యూనిట్లను విక్రయించి 22 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

టాటా మోటార్స్ సాధించిన ఈ భారీ విజయానికి ప్రధాన కారణం హెక్సా, నెక్సాన్ మరియు టియాగో మోడళ్లు. అయితే, టాటా పాత మోడళ్లు అయిన ఇండికా, ఇడిగో మరియు జెస్ట్ వంటి కార్లు ఆశించిన మేర రాణించలేకపోతున్నాయి.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

సియామ్ వెల్లడించిన సేల్స్ రిపోర్ట్స్ ప్రకారం, 2018 ఆర్థిక సంవత్సరంలో 2,583 యూనిట్ల ఇండికా మరియు 1,756 యూనిట్ల ఇండిగో కార్లు అమ్ముడయ్యాయి. అయితే, 2018 ఏప్రిల్ నెలలో ఈ రెండు కార్లు ప్రొడక్షన్ మరియు సేల్స్ సున్నాకు పరిమితమైంది.

ఇండికా మరియు ఇండిగో కార్లకు శాశ్వత వీడ్కోలు పలికిన టాటా

టాటా మోటార్స్ ఇండికా కారును తొలుత 1998లో ప్యాసింజర్ కార్ల లైనప్‌లోకి లాంచ్ చేసింది. కాలం మారేకొద్దీ ఇండికా కారుకు వయసైపోతూ వచ్చింది. దీనికి తోడు కొత్తగా వచ్చే మోడళ్లు ఇండికాను డిజైన్ పరంగా వెనక్కి నెట్టేశాయి. ఇండికా కారుకు కొనసాగింపుగా 2002లో ఇండిగో కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. అత్యంత విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో విడుదలైనప్పటికీ పెద్దగా రాణించలేకపోయింది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors stops production of Indica and Indigo
Story first published: Wednesday, May 23, 2018, 10:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X