హైదరాబాదులో పట్టుబడిన టాటా నానో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన జయేం నియో ఎలక్ట్రిక్ వెహికల్ హైదరాబాదులోని ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్ లాట్‌లో పట్టుబడింది. భారతదేశపు అగ్రగామి క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలాకు చెందిన డీకాల్స్ మరి

By Anil Kumar

టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన జయేం నియో ఎలక్ట్రిక్ వెహికల్ హైదరాబాదులోని ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్ లాట్‌లో పట్టుబడింది. భారతదేశపు అగ్రగామి క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలాకు చెందిన డీకాల్స్ మరియు బాడీ గ్రాఫిక్స్‌ నానో ఎలక్ట్రిక్ ఎక్ట్సీరియర్‌లో గమనించవచ్చు.

టాటా నానో ఎలక్ట్రిక్

అంతే కాకుండా, ఓలా క్యాబ్ సర్వీసుల కోసం తాజాగా ప్రవేశించిన ఎలక్ట్రిక్ వెహికల్ టాటా నానో ఎలక్ట్రిక్. కోయంబత్తూరుకు చెందిన జయేం ఆటోమోటివ్స్ టాటా నానో ఆధారిత నియో ఎలక్ట్రిక్ కారును తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది.

టాటా నానో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ మరియు జయేం ఆటోమోటివ్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ నానో నియో ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. తొలి దశ క్రింది వీటిని మొదట అద్దె కార్లు మరియు క్యాబ్ సర్వీసులు నిర్వహించే కంపెనీలకు మాత్రమే విక్రయించనున్నారు. 200 నియో కార్లను కొనుగోలు చేసిన తొలి సంస్థ ఓలా క్యాబ్స్.

టాటా నానో ఎలక్ట్రిక్

ఒప్పందం ప్రకారం, టాటా మోటార్స్ నానో కారు బాడీలను ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ లేకుండా జయేం ఆటోమోటివ్స్ సంస్థకు సరఫరా చేస్తుంది. జయేం సంస్థ వీటిలో 48వోల్ట్ కెపాసిటి గల ఎలక్ట్రిక్ మోటార్ మరియు డ్రైవ్ సిస్టమ్ జోడిస్తుంది. 23బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే మోటార్‌ను ఎలక్ట్రా ఇవి సంస్థ నుండి సేకరిస్తున్నారు.

టాటా నానో ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన మోటార్, డ్రైవ్ మరియు ఇతర విడి పరికరాలను తయారు చేసే ఎలక్ట్రా ఇవి సంస్థ టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్‌కు కావాల్సిన ఎలక్ట్రిక్ ఉపకరణాలను తయారు చేస్తోంది. ఈ టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును కూడా 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు.

టాటా నానో ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భాగ్యనగరంలో పట్టుబడిన నానో కారులో ఎలాంటి టాటా లోగోలు లేవు. అయితే, జయేం మరియు నియో బ్యాడ్జిలను గుర్తించవచ్చు. లోగోలను మినహాయిస్తే, రెగ్యులర్ నానో మరియు నియో ఎలక్ట్రిక్ మధ్య ఎక్ట్సీరియర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

టాటా నానో ఎలక్ట్రిక్

టాటా బ్యాడ్జి క్రింద వస్తోన్న టాటా టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడళ్ల బాధ్యత కూడా జయేం ఆటోమోటివ్స్ కంపెనీదే. ఉమ్మడి భాగస్వామ్యంతో పర్ఫామెన్స్ వెర్షన్‌లో వీటిని అభివృద్ది చేశారు. అయితే, ఈ రెండింటి విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

టాటా నానో ఎలక్ట్రిక్

విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా జెటిపి (జయేం టాటా పర్ఫామెన్స్) మోడళ్లయిన టిగోర్ మరియు టియాగో జెటిపి 109బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ అనుసంధానంతో లభ్యమవుతుంది.

టాటా నానో ఎలక్ట్రిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి విడుదల కానున్న ఎన్నో ఎలక్ట్రిక్ కార్లలో జయేం నియో ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి. టాటా నానో ఎలక్ట్రిక్ అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది, ఇండియాలో చాలా మంది కస్టమర్లు దీనిని సొంతం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తతం ఉన్న సమాచారం మేరకు, టాటా మోటార్స్ బ్రాండ్ పేరుతోనే నానో ఎలక్ట్రిక్ కార్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 20, 2018, 10:59 [IST]
English summary
Read In Telugu: Tata Nano Electric aka Jayem Neo EV Spotted — The Latest Addition To The Ola Cabs Fleet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+