భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

భారతదేశపు చీపెస్ట్ కారు టాటా నానో సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలయ్యింది. ప్రతి భారతీయుడి సొంత కారు కలను తీర్చడం కోసం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. కానీ మార

By Anil Kumar

భారతదేశపు చీపెస్ట్ కారు టాటా నానో సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలయ్యింది. ప్రతి భారతీయుడి సొంత కారు కలను తీర్చడం కోసం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. కానీ మార్కెట్ నిపుణులు మరియు రతన్ టాటా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

సేల్స్ పూర్తిగా పడిపోవడంతో టాటా నానో ఎప్పుడైనా మార్కెట్ నుండి నిష్క్రమిస్తుందని ఇది వరకటి కథనంలో పేర్కొన్నాము. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు టాటా మోటార్స్ నానో కారు ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు తెలిసింది.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

అవును మీరు చదివింది నిజమే, టాటా నానో సేల్స్ దారుణంగా పడిపోవడంతో నానో ప్రొడక్షన్ నిలిపేసింది. జూన్ 2018 నెలలో కేవలం ఒక్క నానో కారును మాత్రమే ఉత్పత్తి చేసారు, గత ఏడాది ఇదే జూన్ నెలలో 275 యూనిట్లను ఉత్పత్తి చేశారు.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

అయితే, కస్టమర్ల నుండి వచ్చే ఆర్డర్ ప్రాతిపదికన నానో కారును ఉత్పత్తి చేయనున్నారు. దీని అర్థం టాటా నానో ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటుందని కాదు. రానున్న నెలల్లో నానో సేల్స్ పూర్తిగా పడిపోతాయి కాబట్టి. నానో ప్రొడక్షన్‌కు పూర్తిగా స్వస్తి పలికే అవకాశం ఉంది.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

టాటా నానో ప్రొజెక్టుతో భావోద్వేగపు సంభందం ఉండటం మరియు ఈ ప్రాజెక్ట్ వెనుక రతన్ టాటా గారు కీలక పాత్ర పోషించడంతో , గత సెప్టెంబరు 2017లో నానో కారు ప్రొడక్షన్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

టాటా నానో ధరల శ్రేణి రూ. 2.25 లక్షల నుండి రూ. 3.20 లక్షల మధ్య ఉంది. ఇండియాలో మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సరసమైన ధరతో లభించే కారు ఇదే. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందించారు.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

టాటా మోటార్స్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, "టాటా నానో టాటా మోటార్స్ మరియు అందులోని కీలక వ్యక్తుల యొక్క విన్నూత్న ఆవిష్కరణలకు స్పూర్తిగా నిలిచింది. నానో ద్వారా ఆశించిన బిజినెస్ సాధ్యంకాకపోయినా, నానో మోడల్ ఆధారంగా భవిష్యత్తులో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చాడు."

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

టాటా నానో కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు గతంలో పలు కథనాలు వచ్చాయి. ఎలక్ట్రిక్ వెర్షన్ పరిచయంతో టాటా నానో జీవితం మలుపు తీసుకోవడం ఖాయం. టాటా నానో డిజైన్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

భారతదేశపు చీపెస్ట్ కారుకు శాస్వత వీడ్కోలు

టాటా నానో ప్రాజెక్ట్ టాటా మోటార్స్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. విడుదలైన తొలినాళ్లతో కనబరిచిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ గత కొన్నేళ్ల కాలంలో టాటా నానో మీద డిమాండ్ దారుణంగా పడిపోయింది. నానో కారు వెనుక భావోద్వేగపు సంభందం ఉండటంతో ఇప్పటి వరకు ఇలా నెట్టుకుంటూ వచ్చారు. కానీ, తీవ్రంగా నిరాశపరుస్తున్న విక్రయాలు టాటా నానో ప్రొడక్షన్‌కు శాశ్వతంగా ముగింపు పలకడం ఖాయం.

Source: Bloomberg

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nano Production Stopped — To Be Manufactured On Order Basis
Story first published: Friday, July 13, 2018, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X