టాటా నెక్సాన్ ఏఎమ్‌టి వేరియంట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ యొక్క ఆటోమేటిక్ వెర్షన్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల బహుశా మే 2018లో ఉండవచ్చని సమాచారం.

By Anil Kumar

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ యొక్క ఆటోమేటిక్ వెర్షన్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల బహుశా మే 2018లో ఉండవచ్చని సమాచారం.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ అధీకృత డీలర్ల వద్ద నెక్సాన్ ఆటోమేటిక్ వెర్షన్ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. 11,000 చెల్లించి నెక్సాన్ ఏఎమ్‌టి బుక్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

టాటా మోటార్స్ నెక్సాన్ ఏఎమ్‌టి వెర్షన్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. టాటా అందిస్తోన్న నెక్సాన్ సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో తొలుత టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ ప్లస్ లో మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందివ్వనుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

నెక్సాన్ ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ఎ ప్లస్ వేరియంట్‌లో యథావిధిగా రానున్నాయి. అదనంగా, నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్లో స్మార్ట్ హిల్ అసిస్ట్, క్రాల్ ఫంక్షన్ మరియు యాంటీ-స్టాల్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌మిషన్ కంట్రోలర్, కిక్-డౌన్ మరియు ఫాస్ట్-ఆఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఇతర నెక్సాన్ మ్యాన్యువల్ వేరియంట్ల తరహాలోనే ఉంటుంది. కేవలం ఏఎమ్‌టి బ్యాడ్జ్ మరియు ఎట్నా ఆరేంజ్ మరియు సోనిక్ సిల్వర్ డ్యూయల్ టోన్ రూఫ్ న్యూ పెయింట్ స్కీమ్ మినహాయిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ హెడ్ మయాంక్ ప్రతీక్ మాట్లాడుతూ, "2017లో మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుండి నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. శరవేగంగా అభివృద్ది చెందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ అందిస్తోన్న నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు."

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

మయాంక్ మాట్లాడుతూ, విడుదలకు సిద్దమైన ఏఎమ్‌టి కార్లలో నెక్సాన్ ఏఎమ్‌టి ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్. స్పోర్టివ్ డ్రైవ్ పర్ఫామెన్స్ మరియు కస్టమర్లకు థ్రిల్లింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించడంతో పాటు సంస్థ అంచనాలకు అనుగుణంగా భారీ విజయాన్ని సాధించిపెట్టనుందని వివరించాడు.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అనుసంధానంతో లభ్యం కానుంది. రెండు ఇంజన్‌లు కూడా 108బిహెచ్‌పి పవర్ మరియు రెండు ఇంజన్‌లు వరుసగా 170ఎన్ఎమ్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటిలో ఇకో, సిటీ మరియు స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ నెక్సాన్ ఏఎమ్‌టి ఎస్‌యూవీని రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. టాటా నెక్సాన్ గత ఏడాదిలో 25,000 యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని చేధించింది. ఇటీవల కాలంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు వస్తోన్న పాపులారిటీ నేపథ్యంలో నెక్సాన్ భారీ విజయాన్ని అందుకుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి బుకింగ్స్

More from DriveSpark

Article Published On: Tuesday, April 24, 2018, 9:45 [IST]
English summary
Read In Telugu: Tata Nexon AMT Bookings Open — To Be Launched In May 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+