TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టాటా నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ వచ్చేసింది: ధర రూ.9.41 లక్షలు
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఆటోమేటిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత్‌లో టాటా నెక్సాన్ ఆటోమేటిక్ ప్రారంభ ధర రూ. 9.41 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ XZA+ ఆధారంగా వచ్చింది. నెక్సాన్ ఏఎమ్‌టి ఇప్పుడు డీజల్-ఆటోమేటిక్ వెర్షన్‌లో కూడా లభ్యమవుతోంది.
టాటా నెక్సాన్ ఏఎమ్‌టి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో XZA+ వేరియంట్లో లభ్యమవుతోంది. నెక్సాన్ ఏఎమ్‌టి పెట్రోల్ వెర్షన్ ధర రూ. 9.41 లక్షలు మరియు డీజల్ వెర్షన్ ధర రూ. 10.3 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
టాటా నెక్సాన్ లభించే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి. వీటిలో పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీటికి 6-మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కూడా ఉంది.
టాటా నెక్సాన్ ఆటోమేటిక్‌లో మ్యాన్యువల్ మోడ్ ఉంది. ఇది ఆటోమేటిక్‌గా స్పోర్ట్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. నెక్సాన్‌లో ఇకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అంతే కాకుండా నెక్సాన్ ఏఎమ్‌టిలో హిల్-అసిస్ట్ మరియు రద్దీతో కూడిన ట్రాఫిక్‌లో ప్రయాణించేందుకు క్రీప్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఏఎమ్‌టి కేవలం XZA+ టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. మరియు XZ+ మ్యాన్యువల్ వేరియంట్లో ఉన్న అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో అందివ్వడం జరిగింది. ఇతర ఫీచర్లయిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్మార్ట్ కీ వంటివి ఎన్నో ఉన్నాయి.
మ్యాన్యువల్ వేరియంట్లతో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఆరేంజ్ మరియు సిల్వర్ కలర్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో లభ్యమవుతోంది.
నెక్సాన్ ఏఎమ్‌టితో పాటు, టాటా మోటార్స్ ఇమ్యాజినేటర్ అనే కార్ కస్టమైజేషన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఇమ్యాజినేటర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కస్టమర్లు వివిధ రకాల యాక్ససరీలను జోడించుకుని నెక్సాన్ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా మలుచుకోవచ్చు. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా కావాల్సిన యాక్ససరీలను కస్టమర్లు ఆన్‌లైన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
చాలా వరకు పెట్రోల్ కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మరియు డీజల్ కార్లు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తాయి. కానీ, టాటా తమ నెక్సాన్ ఎస్‌యూవీ డీజల్ ఇంజన్-ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌లో లభిస్తోంది. ఇదే సెగ్మెంట్లో పోటీగా ఉన్న మరే ఇతర మోడల్‌లోని డీజల్ వెర్షన్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లో రాలేదు. కాబట్టి, నెక్సాన్ సేల్స్ పెరగడంలో ఈ అంశం కలిసిరానుంది.
ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్‌తో పోల్చుకుంటే టాటా నెక్సాన్ పెట్రోల్ ఏఎమ్‌టి ధర 1.96 లక్షల వరకు తక్కువగా ఉంది. అయితే, పోర్డ్ ఇకోస్పోర్ట్ ట్రెండ్ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 9.76 లక్షలుగా ఉంది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ గురించి నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ద్వారా తెలుసుకోగలరు....