టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఇప్పుడు మరో వేరియంట్లో
టాటా మోటార్స్ తమ నెక్సాన్ మిడ్-వేరియంట్ ఎక్స్ఎమ్ (XM)ను హైపర్‌డ్రైవ్ సెల్ఫ్-షిఫ్ట్ గేర్ (AMT) గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసింది. తాజాగా జరిగిన ఎక్స్ఎమ్ వేరియంట్ ఏఎమ్‌టి విడుదలతో టాటా మోటార్స్ తమ ఆటోమేటిక్
టాటా మోటార్స్ తమ నెక్సాన్ మిడ్-వేరియంట్ ఎక్స్ఎమ్ఎ (XMA)ను హైపర్‌డ్రైవ్ సెల్ఫ్-షిఫ్ట్ గేర్ (AMT) గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసింది. తాజాగా జరిగిన ఎక్స్ఎమ్ వేరియంట్ ఏఎమ్‌టి విడుదలతో టాటా మోటార్స్ తమ ఆటోమేటిక్ కార్ల పరిధిని మరింత విస్తరించింది.

టాటా నెక్సాన్ మిడ్ వేరియంట్ ఎక్స్ఎమ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం అయ్యింది. టాటా నెక్సాన్ పెట్రోల్ ఎక్స్‌ఎమ్‌ఎ వేరియంట్ ధర రూ. 7.50 లక్షలు మరియు నెక్సాన్ డీజల్ ఎక్స్ఎమ్‌ఎ వేరియంట్ ధర రూ. 8.53 లక్షలు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టాటా మోటార్స్ మే 2018లో నెక్సాన్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ చేసింది. అయితే, నెక్సాన్ ఏఎమ్‌టి కేవలం ఎక్స్‌జడ్ఎ + వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు తాజాగా ఎక్స్ఎమ్ఎ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలవ్వడంతో నెక్సాన్ ఏఎమ్‌టి ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతోంది.

టాటా మోటార్స్ సరికొత్త ఇవోరి వైట్ రూఫ్ కలర్ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఈ నూతన కలర్ స్కీమ్ ఎస్‌యూవీకి కూపే స్టైల్ డిజైన్‌ను ఇచ్చింది. నెక్సాన్ మిడ్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేయడంతో, టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఇప్పుడు ఎక్స్ఎమ్ఎ మరియు ఎక్స్‌జడ్ఎ+ వేరియంట్లలో లభ్యమవుతోంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఎస్‌యూవీలో మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఇకో, సిటీ మరియు స్పోర్ట్. కనెక్ట్ నెక్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రిమోట్ కంట్రోల్ లాకింగ్, పవర్ టెయిల్ గేట్ మరియు ఫాలో-మి-హోం హెడ్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ఎ ఆటోమేటిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇవి వరుసగా 108బిహెచ్‌పి-170ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ఎ వేరియంట్లో సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్ాయి. మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ టెక్నాలజీ కూడా ఉంది.

అన్నింటి కంటే మించి టాటా నెక్సాన్ ఏఎమ్‌టిలో ప్రతి ఒక్కరిని ఆకర్షించే క్రాల్ టెక్నాలజీ ఉంది. ఇది ట్రాఫిక్‌లో ఉన్నపుడు యాక్సిలరేషన్ చేయకుండానే కారు నెమ్మదిగా ముందుకు కదలడానికి సహాయపడుతుంది. మరియు 350-లీటర్ల కెపాసిటి గల బూట్ స్పేస్ ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను ఇప్పుడు ఎక్స్ఎమ్ఎ వేరియంట్లో లాంచ్ చేసింది. దీంతో నెక్సాన్ ఏఎమ్‌టి లభించే సంఖ్య వేరియంట్ల సంఖ్య రెండుకు చేరుకుంది. టాటా నెక్సాన్ ఏఎమ్‌టి విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా ఏఎమ్‌టి మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఏఎమ్‌టి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








