టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

టాటా నెక్సాన్ ఢిల్లీ డెవిల్స్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ విషయానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ లోగో మరియు రెడ్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

By Anil Kumar

2018 ఐపిఎల్ 11వ ఎడిషన్‌‌లో టాటా నెక్సాన్ అధికారిక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్‌ను పురస్కరించుకుని టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని ఐపిఎల్ జట్లకు గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెడుతోంది.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

ఇప్పటికే ముంబాయ్ ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్‌లకు గుర్తుగా మూడు స్పెషల్ ఎడిషన్లలో నెక్సాన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన టాటా ఇప్పుడు తాజాగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ వెర్షన్ నెక్సాన్ ప్రవేశపెట్టింది.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

ఇప్పటి వరకు ఐపిఎల్‌తో అఫీషియల్ కారుగా భాగస్వామ్యం పొందిన కార్లలో చాలా వరుకు స్టేడియంలోని స్టేజ్ షోలకే పరిమితమయ్యాయి. కానీ, వరుసగా మూడేళ్ల పాటు అఫీషియల్ కారుగా అవకాశం సొంతం చేసుకున్న టాటా నెక్సాన్ ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించిన క్రికెట్ ప్రియులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

అందులో భాగంగానే క్రికెట్ ప్రేమికుల కోసం ఆయా ఐపిల్ జట్లను సూచించే విధంగా ప్రత్యేకమైన బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్‌తో నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఆధారంగా ఐపిఎల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‍‌‌యూవీలను రూపొందిస్తోంది.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

టాటా నెక్సాన్ ఢిల్లీ డెవిల్స్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ విషయానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ లోగో మరియు రెడ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ప్రత్యేకించి ఫ్రంట్ ఎయిర్ డిఫ్యూసర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు ఫ్రంట్ గ్రిల్ మీద రెడ్ కలర్ స్ట్రిప్స్ గమనించవచ్చు.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

ఎస్‌యూవీ మొత్తం డ్యూయల్ టోన్ మ్యాట్ ఫినిషింగ్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సిల్వర్ కలర్ బాడీ పెయింట్ మీద రెడ్ కలర్ మ్యాట్ ఫినిషింగ్‌లో ఉన్న ఎ-పిల్లర్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ గమనిస్తే, అల్లాయ్ వీల్స్ మీద కూడా రెడ్ కలర్ హైలైట్స్ చూడవచ్చు.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

నెక్సాన్ ఎస్‌యూవీకి ఇరువైపులా ఢిల్లీ డేర్‌డెవిల్స్ లోగో గల బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఎస్‌యూవీ ఓవరాల్ మోడిఫికేషన్‌కు సరిపోయే విధంగా రియర్ బంపర్ మీద కూడా రెడ్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

సాంకేతికంగా టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభించే నెక్సాన్ ఇండియన్ మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందింది.

టాటా నెక్సాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎడిషన్

రెండు ఇంజన్‌లు కూడా 108బిహెచ్‌పి పవర్ మరియు వరుసగా 170 మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. అంతే కాకుండా టాటా ఇటీవల నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసింది.

ఈ ఎడిషన్‌తో ఇప్పుడు మొత్తం నాలుగు స్పెషల్ ఐపిఎల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీలను టాటా సిద్దం చేసింది. అయితే, వీటిని విక్రయించడానికా... లేదంటే ప్రదర్శన కోసమేనా... అనేది ఇంకా స్పష్టం కాలేదు.

Source: Youtube

More from DriveSpark

Article Published On: Thursday, May 10, 2018, 9:50 [IST]
English summary
Read In Telugu: Tata Nexon Delhi Daredevils version
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+