నెక్సాన్ ఐపిఎల్ ఎడిషన్ ఆవిష్కరించిన టాటా
టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని ఐపిఎల్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. ముంబాయ్ ఇండియన్స్ బాడీ పెయింట్ కలర్‌లో స్కీములో టాటా షోరూమ్ వద్ద తారసపడింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీని టాప్ ఎండ్ వేరియం
టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వివో ఐపిఎల్ 2018 ఎడిషన్‌లో అఫీషియల్ కారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న 11 వ ఎడిషన్ ఐపిఎల్ వేదికగా టాటా మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి నెక్సాన్ ఎస్‌యూవీని ప్రమోట్ చేస్తోంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని ఐపిఎల్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. ముంబాయ్ ఇండియన్స్ బాడీ పెయింట్ కలర్‌లో స్కీములో టాటా షోరూమ్ వద్ద తారసపడింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీని టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ ప్లస్ ఆధారంగా రూపొందించారు.

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, నెక్సాన్ ఎస్‌యూవీ ఐపిఎల్ ముంబాయ్ ఇండియన్స్ జట్టు ఆధారంతో రూపొందించిన బాడీ డీకాల్స్ గల మోడల్ ముంబాయ్‌లోని టాటా షోరూమ్‌లో పట్టుబడింది. నూతన బాడీ డీకాల్స్, లిక్విడ్ సిల్వర్ పెయింట్ మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి.

సబ్-నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌లో బానెట్ మీద బ్లాక్ స్పోర్టివ్ స్ట్రిప్స్, మరియు యెల్లో కలర్ స్ట్రిప్స్ హైలైట్‌గా ఉన్నాయి. ఫ్రంట్ డిజైన్‌లో ఎయిర్ ఇంటేకర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ క్రింది వైపున యెల్లో స్ట్రిప్స్ ఉన్నాయి. వీటితో, పాటు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కూడా పసుపు వర్ణపు పట్టీలను కలిగి ఉన్నాయి.

రూఫ్ మొత్తం మరియు షోల్డర్ భాగంతో పాటు రియర్ స్పాయిలర్, వీల్ ఆర్చెస్, టెయిల్ ల్యాంప్ ఫినిషింగ్స్ మరియు రియర్ బంపర్ వంటివి ఆకర్షణీమైన మ్యాట్ బ్లూ ఫినిషింగ్ పెయింట్ స్కీమ్ కలిగి ఉన్నాయి.

లిక్విడ్ సిల్వర్ బాడీ పెయింట్ స్కీమ్, బ్లూ మరియు యెల్లో పట్టీలతో పాటు ఈ ఎస్‌యూవీ మీద ఫ్రంట్ వీల్ ఆర్చెస్ మరియు రియర్ బంపర్ వద్ద ముంబాయ్ ఇండియన్స్ లోగో ఉంది. ఈ అన్ని బాడీ డీకాల్స్ నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్ యొక్క ఎక్ట్సీరియర్‌లో ఆప్షనల్‌గా వచ్చాయి. ఇంటీరియర్ మరియు సాంకేతికంగా ఇందులో మార్పులు జరుగుతున్నట్టు ఎలాంటి సమాచారం లేదు.

టాటా మోటార్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో అధికారిక ప్రధాన స్పాన్సర్స్‌గా భాగస్వామపు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రానున్న మూడేళ్లపాటు ఉండటంతో, ఈ ఏడాది జరిగే అన్ని ఐపిల్ మ్యాచుల్లో టాటా తమ నెక్సాన్ ఎస్‌యూవీని ప్రదర్శిస్తుంది.

అంతే కాకుండా టాటా మోటార్స్ క్రికెట్ ఫ్యాన్స్ మరియు ప్లేయర్లతో మమేకమయ్యేందుకు పలు అవకాశాలను కల్పించి, ఈ సీజన్‌లో టాటా నెక్సాన్ ఎస్‌యూవీని సొంతం చేసుకునే ఛాన్స్ కల్పించింది. అంతే కాకుండా, ఎనిమిది మంది ఐపిఎల్ టీమ్ కెప్టెన్లు సంతకం చేసిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీని వేలం వేయనుంది.

టాటా మోటార్స్ ఇటీవల నూతన ఎక్స్‌జడ్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది విపణిలో ఉన్న ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. టాటా నెక్సాన్ సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

వీటిలో రెండు ఇంజన్‌లు 108బిహెచ్‌పి పవర్ మరియు వరుసగా 170ఎన్ఎమ్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతానికి నెక్సాన్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది. అతి త్వరలో దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లాంచ్ చేయనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
లిమిటెడ్ ఎడిషన్ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ముంబాయ్‌లోని పలు టాటా డీలర్ల వద్ద ఉన్నాయి. వీటిని పూర్తిగా, డీలర్లు మాత్రమే రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చారు, ఇందులో టాటా మోటార్స్ ప్రమేయం ఏ మాత్రం లేదని తెలిసింది.
అదనంగా ఉన్న బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ గల టాటా నెక్సాన్ లిమిటెడ్ ఎడిషన్ ఖచ్చితంగా యువ కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులు మరియు ఐపిఎల్‌డకు ఉన్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా నెక్సాన్‌ను ప్రత్యేమైన కాస్మొటిక్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Source: WheelBHP


Click it and Unblock the Notifications








