టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా మోటార్స్ తమ నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అరుదైన రికార్డును నెలకొల్పింది. టాటా మోటార్స్ ఇటీవల టాటా నెక్సాన్ 50,000 ప్రొడక్షన్ మైలురాయిని అందుకున్న వేడుకను జరుపుకుంది.

By Anil Kumar

టాటా మోటార్స్ తమ నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అరుదైన రికార్డును నెలకొల్పింది. టాటా మోటార్స్ ఇటీవల టాటా నెక్సాన్ 50,000 ప్రొడక్షన్ మైలురాయిని అందుకున్న వేడుకను జరుపుకుంది.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

పూనేలో ఉన్న రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో 50,000 వ నెక్సాన్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసి, ఈ సందర్భాన్ని పురస్కరించుకున్నారు. నెక్సాన్ గత ఏడాది సెప్టెంబరులో మొట్టమొదటిసారిగా విపణిలోకి విడుదలయ్యింది.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా నెక్సాన్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా సగటున 4,000 యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయి. దీంతో టాటా ఇండియా ప్యాసింజర్ కార్ల శ్రేణిలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా నెక్సాన్ కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్ మాత్రమే కాకుండా, దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది. అవును, ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ మేడిన్ ఇండియా టాటా నెక్సాన్ ఐదుకు గాను 4-స్టార్ల రేటింగ్ సాధించింది.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా నెక్సాన్ విడుదలైనప్పటి నుండే పాపులర్ ఎస్‌యూవీగా రాణిస్తోంది. నెక్సాన్ విడుదలైన తొలి మూడు నెలల్లో నవంబరు 2017 నెల విక్రయాలతో 10,000 యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించింది. ఈ యేడు ఫిబ్రవరితో 25,000 యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని చేరుకుంది.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

ఫీచర్ల విషయానికి వస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్రైవర్-సైడ్-సీట్ ఎత్తును సరిచేసుకునే సౌకర్యం, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్ సపోర్ట్ చేయగల స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో పాటు రివర్స్ కెమెరా కూడా కలదు.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

టాటా నెక్సాన్ ఏడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. టాటా నెక్సాన్ ధరల శ్రేణి రూ. 6.15 లక్షలతో మొదలుకొని గరిష్టంగా రూ. 10.59 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

టాటా నెక్సాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి. తన సొగసైన డిజైన్, కూపే తరహా స్టైలింగ్, విలాసవంతమైన ఎక్ట్సీరియర్ ఫీచర్లు, సౌకర్యవంతమైన మరియు లగ్జరీ కార్లను తలదన్నే ఇంటీరియర్ ఫీచర్లు, అన్నింటికీ మించి ధరకు తగ్గ విలువలతో అత్యంత శక్తివంతమైన ఇంజన్, అత్యుత్తమ మైలేజ్ మరియు భద్రత వంటి అంశాల పరంగా బెస్ట్ ఎస్‌యూవీగా నిరూపించుకుంది.

టాటా నెక్సాన్ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon Achieves 50,000 Units Production Milestone Since Launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X