ఐపిఎల్ సీజన్‌లో లక్ష రుపాయల నగదు మరియు టాటా నెక్సాన్ గెలుపొందండి - ఎలా అంటే?

Written By:

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తున్న టాటా మోటార్స్ భారతదేశపు ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో అఫీషియల్ స్పాన్సర్స్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. టాటా మోటార్స్ మరియు ఐపిఎల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం 2018 నుండి మూడేళ్ల పాటు కొనసాగనుంది.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

టాటా మోటార్స్ ఈ ఐపిఎల్ సీజన్‌లో క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడానికి టాటా నెక్సాన్ ఫ్యాన్ క్యాచ్ ప్రోగ్రాం నిర్వహించనుంది. ఐపిఎల్ మ్యాచుల్లో సింగల్ హ్యాండ్‌తో క్యాచ్ పడితే టాటా నుండి లక్ష రుపాయలు నగదు బహుమానం మరియు సీజన్ విన్నర్ నెక్సాన్ ఎస్‌యూవీని గెలుపొందవచ్చు.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

ఈ ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ సూపర్ స్ట్రైకర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి మ్యాచ్‌లో బెస్ట్ స్ట్రైకర్ అవార్డును మరియు సీజన్‌ మొత్తంలో బెస్ట్ స్ట్రైకర్ విన్నర్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీని గెలుపొందవచ్చు.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

అంతే కాకుండా, టాటా మోటార్స్ బ్రాండుతో క్రికెట్ అభిమానులు మమేకమయ్యేందుకు ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ మొత్తం పలు రకాల కార్యక్రమాలు, ఈవెంట్లు మరియు టాటా నెక్సాన్ సేల్స్ కౌంటర్లను ఏర్పాటు చేస్తోంది.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌ను ఐపిఎల్ సీజన్ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని స్టేడియంలలో జరిగే ప్రతి మ్యాచ్‌లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చే

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ మయాంక్ పరీక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఐపిఎల్‌తో జతకట్టి పాపులర్ అయిన టాటా నెక్సాన్ బ్రాండ్‌తో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో జరిగే అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లో ఐపిఎల్ ఒకటి. ఎక్కువ మంది ఔత్సాహికులను మరియు క్రీడా అభిమానులకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీని చేరువ చేయడంలో ఈ మూడేళ్ల కోసం కుదిరిన ఒప్పందం టాటా మోటార్స్‌కు ఎంతగానో కలిసిరానుంది.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

టాటా మోటార్స్ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ ఎస్‌యూవీని డిసెంబరు 2017 లో రూ. 5.85 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. వీటిలో రెండు వేరియంట్లు 108బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తే, పెట్రోల్ మోడల్ 170ఎన్ఎమ్ టార్క్ మరియు డీజల్ మోడల్ 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఐపిఎల్ సీజన్‌లో టాటా నెక్సాన్ గెలుపొందండి

1. సెకండ్ హ్యాండ్ బైకుల కంటే తగ్గిన కొత్త బజాజ్ సిటి100 ధరలు

2.యమహా ఆర్1 బైకు మీద 2.57 లక్షలు తగ్గిన ధర

3.రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

4.భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా వరుసగా మూడవ సారి!!

English summary
Read In Telugu: Stand A Chance To Win A Tata Nexon This IPL Season — Gear Up For IPL 2018
Story first published: Friday, March 23, 2018, 15:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark