టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్ విడుదల

టాటా మోటార్స్ గత ఏడాది విడుదల చేసిన నెక్సాన్ కంపాక్ట్ ఎస్‌యూవీ మంచి సక్సెస్ అందుకుంది. అయితే, అందరూ ఎంచుకునే కలర్ ఆప్షన్‌లలో కాకుండా, విభిన్న పెయింట్ స్కీములో వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా నెక్సాన్ ఎస

By Anil Kumar

టాటా మోటార్స్ గత ఏడాది విడుదల చేసిన నెక్సాన్ కంపాక్ట్ ఎస్‌యూవీ మంచి సక్సెస్ అందుకుంది. అయితే, అందరూ ఎంచుకునే కలర్ ఆప్షన్‌లలో కాకుండా, విభిన్న పెయింట్ స్కీములో వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా నెక్సాన్ ఎస్‌యూవీలను ఎంచుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

అంటే... మీకు నచ్చిన పెయింట్ స్కీము మరియు స్టైలిష్ థీమ్‌లలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ఉదాహరణగా టాటా మోటార్స్ ఢిపరెంట్ పెయింట్ స్కీమ్‌లో పలు ఎడిషన్‌లను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టి ఫ్రాజెన్ ఎడిషన్.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

టాటా మోటార్స్ ఇటీవల ఆవిష్కరించిన కస్టమైజ్ ఎస్‌యూవీలలో నెక్సాన్ ఎస్ఆర్‌టి ఫ్రాజెన్ ఎడిషన్ ఒకటి. దీని ఎక్ట్సీరియర్‌లో గాఢ పసుపు రంగులో ఉన్న బాడీ, గ్రే కలర్ విండో స్ట్రిప్స్ మరియు ఆల్ బ్లాక్ రూఫ్ టాప్ మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

ఐపిఎల్ 2018 సీజన్‌లో అఫిషీయల్ కారుగా ఉన్నపుడు ఐపిఎల్ జట్లను ఆధారంగా పలు ఎడిషన్‌లలో నెక్సాన్‌ను ఆవిష్కరించింది. వీటన్నింటి మోడిఫికేషన్స్ వెనుక టాటా పర్సనలైజేషన్ స్టుడియో ఉన్నట్లు తెలిసింది.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టాటా నెక్సాన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ఉన్న స్మార్ట్‌హబ్ స్టాల్ వేదికగా టాటా పర్సనలైజేషన్ స్టుడియోను ప్రారంభించింది. ఈ స్టుడియో సాధారణ కలర్ ఆప్షన్స్‌లో లభించే కార్లను కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా ప్రత్యేక కలర్ థీమ్‌లో తీర్చిదిద్దుతుంది.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

అయితే, ప్రస్తుతానికి టాటా పర్సనలైజేషన్ స్టుడియో పలు విభిన్న థీమ్‌లలో నెక్సాన్ ఎస్‌యూవీలని రూపొందించి, ఆవిష్కరిస్తోంది. ఈ పర్సనలైజేషన్ స్టుడియో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, టియాగో, బోల్ట్, జెస్ట్, నెక్సాన్, హెక్సా మరియు సఫారీ స్టార్మ్ మోడళ్లను కలర్ కస్టమైజేషన్‌తో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

పర్సనలైజేషన్ స్టుడియో ఇప్పుడు కేవలం టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి మాత్రమే కస్టమైషన్ నిర్వహిస్తోంది. ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్, కాంట్రాస్ట్ రూఫ్, అల్లాయ్ వీల్స్, డిజైన్ మరియి డీకాల్ అదే విధంగా ఇంటీరియర్‌లో సీట్ కవర్ కలర్ థీమ్, స్టీరింగ్ వీల్ కవర్ మరియు డ్యాష్ బోర్డు మీద కలర్ ఆప్‌డేట్స్ మరియు పర్సనలైజేషన్ కలర్ థీమ్స్ ఉంటాయి.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

టాటా మోటార్స్ ఇటీవల పరిచయం చేసిన ఫీచర్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఒకటి. కొత్తగా నెక్సాన్ ఎంచుకునే కస్టమర్లు సన్‌రూఫ్ ఉన్న వేరియంట్‌ను ఎంచుకోగలరు. అంతే కాకుండా, పలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మీద కూడా టాటా పనిచేస్తోంది.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టి ఫ్రాజెన్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్ కలర్ థీమ్ మరియు ఇంటీరియర్ కలర్ అప్‌డేట్స్ మినహాయిస్తే సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అదే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదలతో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఏప్రిల్ 2018 సేల్స్ గణాంకాల్లో టాటా నెక్సాన్ అమ్మకాలు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సేల్స్‌ను దాటేశాయి.

టాటా నెక్సాన్ ఎస్ఆర్‌టీ ఫ్రాజెన్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ అన్ని రకాల్ ఏజ్ గ్రూపులను టార్గెట్ చేస్తూ నెక్సాన్ ఎస్‌యూవీని విభిన్న కలర్ థీమ్ మరియు ఎడిషన్‌‌లలో ఆవిష్కరిస్తోంది. 2018 ఐపిఎల్ ఎడిషన్ ద్వారా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుకు అఫిషీయల్ కారుగా ప్రతి మ్యాచులో క్రికెట్ అభిమానులను కనువిందు చేసింది. అదనంగా, ఐపిఎల్ 2018లో ఉన్న వివిధ జట్ల ఆధారంగా స్పెషల్ ఎడిషన్‌లో కస్టమైజేషన్ చేసిన నెక్సాన్ ఎస్‌యూవీలను టాటా మోటార్స్ తమ డీలర్లను వేదికగా చేసుకుని ప్రవేశపెట్టింది. ఏదేమైనప్పటికీ, కస్టమర్లను చేరుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను టాటా చక్కగా వాడుకుంటోందని చెప్పవచ్చు.

Source: Forum Autocarindia

More from DriveSpark

Article Published On: Monday, May 28, 2018, 16:19 [IST]
English summary
Read In Telugu: Tata Nexon SRT Frozen Edition seen at dealership
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+