ఫోర్డ్ ఇండియాకు చుక్కలు చూపించిన టాటా నెక్సాన్

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టాటా మోటార్స్ పరిచయం చేసిన నెక్సాన్ ఎస్‌యూవీ ఈసెగ్మెంట్లో ఉన్న ఇతర ఎస్‌యూవీలకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన టాటా నెక్సాన్ భారీ విక్రయాలత

By Anil Kumar

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టాటా మోటార్స్ పరిచయం చేసిన నెక్సాన్ ఎస్‌యూవీ ఈసెగ్మెంట్లో ఉన్న ఇతర ఎస్‌యూవీలకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన టాటా నెక్సాన్ భారీ విక్రయాలతో ఇప్పుడు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని వెనక్కి నెట్టింది.

టాటా నెక్సాన్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి చాలా ఆలస్యంగా, అన్నింటి కంటే చివరలో ప్రవేశించినప్పటికీ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీ విభాగంలో ఎంతో కస్టమర్ల హృదయాలను దోచుకుంది. మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ప్రతి నెలా సగటున 4,500 టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నాయి.

టాటా నెక్సాన్

2018-19 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో 13,173 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2018 లో 4148 యూనిట్లు, మే 2018లో 4717 యూనిట్లు మరియు జూన్ 2018లో 4308 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

టాటా నెక్సాన్

ఇదే సెగ్మెంట్లో నెక్సాన్ ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తున్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇదే మూడు నెలల కాలంలో 13,138 యూనిట్లను విక్రయించింది(వరుసగా 4128, 5003, 4007). రెండింటి విక్రయాలతో పోల్చుకుంటే మొదటి త్రైమాసికంలో టాటా నెక్సాన్ ఎక్కువ విక్రయాలు సాధించింది.

టాటా నెక్సాన్

కానీ, ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎప్పటిలాగే మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీ తన స్థానాన్ని పధిలపరుచుకుంది. వితారా బ్రిజా నెలవారీ సేల్స్ టాటా నెక్సాన్ మూడు నెలల సేల్స్‌కు సమానం.

టాటా నెక్సాన్

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకంగా 37,160 యూనిట్ల వితారా బ్రిజా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. వీటిలో ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో వరుసగా 10,818, 15,629, 10,713 యూనిట్లను విక్రయించారు.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన కారు మరియు ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కూడా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభిస్తోంది.

టాటా నెక్సాన్

ఏదేమైనప్పటికీ, టాటా నెక్సాన్ ఈ విభాగంలో ఒక కీలకమైన మోడల్ అని నిరూపించుకుంది. టాటా నెక్సాన్ మీద కస్టమర్లకు మంచి అభిప్రాయం ఏర్పడుతోంది మరియు టాటా నెక్సాన్ ఖాతాలో సంతృప్తి చెందిన కస్టమర్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి, ఈ గణాంకాలే భవిష్యత్తులో టాటా నెక్సాన్ మరిన్ని సేల్స్‌కు తోడ్పడనున్నాయి.

టాటా నెక్సాన్

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఆజ్యం పోసింది. ఈ సెగ్మెంట్లోకి విడుదలైన మారుతి వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ విక్రయాలను తినేస్తున్నాయి.

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నెక్సాన్ ఎస్‌యూవీని నిర్మించింది. ఇదే ఫ్లాట‌్‌ఫామ్ మీద నిర్మించిన టియాగో, టిగోర్ మరియు హెక్సా మోడళ్లు కూడా భారీ సక్సెస్ చవిచూసింది. దీనికి కొనసాగింపుగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధాంగా హెచ్5ఎక్స్ మరియు 45ఎక్స్ అనే కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ భవిష్యత్తులో ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకునేందుకు 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ, మరో 5-సీటర్ ఎస్‌యూవీ మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లను రానున్న రెండేళ్ల కాలంలో వరుసగా విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 6, 2018, 11:44 [IST]
English summary
Read In Telugu: Tata Nexon surpasses Ford EcoSport in sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+