మరో కొత్త వేరియంట్లో నెక్సాన్ విడుదలకు సిద్దపడుతున్న టాటా

Written By:

టాటా మోటార్స్ తమ నెక్సాన్ మోడల్‌లో మరో కొత్త వేరియంటును పరిచయం చేయడానికి సిద్దమైంది. 2017 డిసెంబరులో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అతి త్వరలో ఎక్స్‌జడ్ వేరియంట్లో విడుదల చేయనుంది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ప్రస్తుతం XE, XM, XT మరియు XZ+ వేరియంట్లలో లభిస్తోంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ XZ+ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తూ, XZ వేరియంట్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

నెక్సాన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ల మధ్య ధరల వ్యత్యాసం రూ. 75,000 లు ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్లు అయిన XT మరియు XZ+ వేరియంట్ల మధ్య ధరల వ్యత్యాసం రూ. 1.45 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ల మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేయడానికి XZ వేరియంట్‌ను విడుదల చేయనుంది.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు. పలు రకాల డ్రైవింగ్ మోడ్‌లతో 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించనుంది.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

టాప్ ఎండ్ వేరియంట్ XZ+ తో పోల్చుకుంటే XZ వేరియంట్లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, డ్యూయల్ టోన్ రూఫ్, ఫ్రంట్ మరియు రియర్ ఫాగ్ ల్యాంప్స్ మరియు వెనుక వైపున డీఫాగర్ వంటి ఎక్ట్సీరియ్ ఫీచర్లు మిస్సయ్యాయి.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

నెక్సాన్ XZ ఇంటీరియర్‌లో ముందు మరియు వెనుక వైపున సెంటర్ ఆర్మ్ రెస్ట్, 60:40 నిష్పత్తిలో మడిచే వీలున్న స్ల్పిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు మరియు స్మార్ట్ కీ పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు మిస్సయ్యాయి.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

ఏదేమైనప్పటికీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల 6.5-అంగుళాల పరిమాణం ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు సీటు బెల్ట్స్, రియర్ ఏసి వెంట్స్ గల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు నెక్సాన్ XZ వేరియంట్లో వచ్చాయి.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

టాటా మోటార్స్ సేల్స్ పెంచుకోవడానికి నెక్సాన్ బ్రాండ్ మీద ఎక్కువ దృష్టిసారించింది. మార్కెట్లో ఉన్న డిమాండుకు అనుగుణంగా నూతన వేరియంట్లతో పాటు, ఆటోమేటిక్ వెర్షన్ కూడా లాంచ్ చేయడానికి టాటా సిద్దమవుతోంది.

కొత్త వేరియంట్లో టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఇప్పటికే, భారతదేశపు ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2018 సీజన్‌తో చేతులు కలిపింది. టాటా నెక్సాన్ బ్రాండ్ 2018 నుండి వరుసగా మూడేళ్ల పాటు ఐపిఎల్ అఫీషియల్ కారుగా కారుగా కొనసాగనుంది. ఐపిఎల్ మ్యాచులు జరిగే ప్రతి స్టేడియంలో నెక్సాన్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది.

Source: Team BHP

English summary
Read In Telugu: Tata Motors To Add A 'XZ' Variant To Its Nexon Lineup
Story first published: Saturday, March 24, 2018, 20:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark