సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ 3,192 యూనిట్ల సఫారీ స్టార్మ్ 4X4 ఎస్‌యూవీలను సరఫరా చేసేందుకు ఇండియన్ ఆర్మీ నుండి భారీ ఆర్డరును సొంతం చేసుకుంది. ఇండియన్ ఆర్మీలో జనరల్ సర్వీస్ (జిఎస్800) కెటగిరీ క్రింద వీటిని సరఫరా చేయడ

By Anil Kumar

టాటా మోటార్స్ 3,192 యూనిట్ల సఫారీ స్టార్మ్ 4X4 ఎస్‌యూవీలను సరఫరా చేసేందుకు ఇండియన్ ఆర్మీ నుండి భారీ ఆర్డరును సొంతం చేసుకుంది. ఇండియన్ ఆర్మీలో జనరల్ సర్వీస్ (జిఎస్800) కెటగిరీ క్రింద వీటిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు, టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఎస్‌యూవీల డెలవరీలను ప్రారంభించింది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీ ఎస్‌యూవీలనులారీలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. ఆర్మీ వెహికల్స్ కామన్‌గా కనబడే ఆలీవ్ గ్రీన్ కలర్ పెయింట్ ఫినిషింగ్‌లో సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఎక్ట్సీరియర్‌లోని అన్ని ప్రధాన భాగాలతో పాటు చివరికి చక్రాలను కూడా గ్రీన్ కలర్‌లో అందించారు.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ ఇకమీదట ఇండియన్ ఆర్మీ యొక్క నూతన జనరల్ పర్పస్ లైట్ యుటిలిటి వెహికల్ కానుంది. గతంలో ఉన్న మారుతి జిప్సీ, ఎమ్ఎమ్550 డీఎక్స్‌బీ మరియు హిందుస్తాన్ అంబాసిడర్ వంటి వాహనాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆర్మీ సేవల్లో ఈ జనరల్ పర్పస్ వాహనాలను స్టాఫ్ కార్లుగా ఉపయోగిస్తారు.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

అంతే కాకుండా, ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ వాహనాలను సెకండరీ పెట్రోలింగ్ మరియు ఇతర చిన్నపాటి యుద్ద అవసరాలకు వీటిని ఉపయోగించనున్నారు. అంతే కాకుండా టాటా మోటార్స్ వీటిలో చిన్నపాటి యుద్దాల్లో పాల్గొనేందుకు ఓ మోస్తారు భద్రత ఫీచర్లను అందించింది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఎస్‌యూవీలలో 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల, టర్బోఛార్జ్‌డ్ వారికోర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 154బిహెచ్‌పి పవర మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా 4X4 డ్రైవ్ సిస్టమ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సఫారీలో కూడా ఇవే ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్‌లో సైనికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు రోల్ఓవర్ మిటిగేషన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, వెనుక వైపున జెర్రీ క్యాన్లు, ఫ్రంట్ బంపర్ మీద అదనపు లైట్లు మరియు బానెట్ మీద యాంటెన్నా వంటివి ఉన్నాయి.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

తాజాగా ఇండియన్ ఆర్మీ జనరల్ సర్వీస్ 800 విభాగంలో పరిచయమైన టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఎస్‌యూవీలు ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఆర్మీకి సేవలందించిన మారుతి జిప్సీ స్థానాన్ని శాశ్వతంగా సొంతం చేసుకుంది. ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ చూడటానికి అచ్చం రెగ్యులర్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే, ఆర్మీ ఎడిషన్ సూచించేందుకు ఎక్ట్సీరియర్ మొత్తం ఆలివ్ గ్రీన్ పెయింట్ ఫినిషింగ్ కలదు.

Source: Tejas-India's MRCA

More from DriveSpark

Article Published On: Monday, May 21, 2018, 12:33 [IST]
English summary
Read In Telugu: Tata Safari Storme Army Edition Deliveries Begin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+