ఆర్మీ ఎడిషన్‌లో టాటా సఫారీ: అసలు తిరకాసు ఇక్కడే ఉంది!!

Written By:

ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీ ఫోటోలు చూడగానే ఎంతో సఫారీ ప్రేమికుల్లో ఓ మెరుపు మెరిసింటుంది. కానీ, అందరూ టాటా మోటార్స్‌ను క్షమించాలి. ఎందుకంటే, ప్రతి అడ్వెంచర్ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకోగల ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీని విక్రయాల కోసం కాకుండా భారత సైన్యం కోసం అభివృద్ది చేసింది. మార్కెట్లో అందుబాటులో లేకపోయినా సైన్యానికి మరింత బలం చేకూర్చనున్న సఫారీ ఆర్మీ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

ఇండియన్ ఆర్మీ సైన్యంలో చేరడానికి గర్వంగా సిద్దమైన తొలి ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ ఫోటోలు విడుదలయ్యాయి. భారత సైన్యానికి ఎన్నో వాహనాలను అందించిన టాటా మోటార్స్ ఇప్పుడు ఆర్మీలో సైనికుల రవాణా కోసం ప్రత్యేకంగా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని గ్రీన్ కలర్ పెయింట్ స్కీమ్‌ అందించి ఆర్మీ ఎడిషన్‌లో అందివ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

సైనిక బలగాలు సరిహద్దుల్లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి అవసరమయ్యే వ్యక్తిగత రవాణా వాహనాలను సరఫరా చేసే ఆర్డర్‌ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డరును దక్కించుకోవడానికి పోటీలో నిలిచిన మహీంద్రా మరియు నిస్సాన్ కంపెనీలను సఫారీ స్టార్మ్ ఇంటికి పంపింది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

సైనికుల వ్యక్తిగత రవాణా కోసం టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని ఇండియన్ ఆర్మీ ఎంచుకుంది. ఇప్పుడు, భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీకి 3,192 ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను సరఫరా చేయాల్సి ఉంది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ ఫోటోలను పరిశీలిస్తే ఎక్ట్సీరియర్ బాడీ మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో ఉన్న చాలా వాహనాలు ఇదే రంగులో ఉంటాయి. శత్రు సైన్యాల కంటికి చిక్కకుండా చెట్లు మరియు పొదల చాటున మాటు వేయడానికి ఈ రంగు వాహనాలు బాగా ఉపయోగపడతాయి.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్ బాహ్య భాగం మొత్తం గ్రీన్ ఫినిషింగ్‌లో ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి క్రోమ్ పరికరాలు మరియు ఇతర స్టైలింగ్ ఎలిమెంట్లు లేవు. చివరికి ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్‌లో వాడిన ప్లాస్టిక్ భాగాలు కూడా ఆర్మీ గ్రీన్ రంగును పులుముకున్నాయి. ఇందులో గ్రీన్ కలర్‌లో లేని యాక్ససరీలు ఫుట్ స్టెప్స్ మరియు రూఫ్ రెయిల్స్.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

నాలుగు చక్రాలకు ఉన్న వీల్ కవర్స్ కూడా గ్రీన్ కలర్‌లోనే ఉన్నాయి. ఇతర ఫీచర్లుగా చిన్న ఫ్యూయల్ ట్యాంకు, వెనుక వైపున రికవరీ హుక్, ఫ్రంట్ బానెట్ మీద ఉన్న స్టబ్బీ యాంటెన్నా మరియు బంపర్ మీద జంటగా ఉన్న స్పాట్ లైట్లు ఉన్నాయి.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

ఇంటీరియర్ మొత్తం బీజి రంగులో ఉంది. అయితే, ఇంటీరియర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేది తెలియరాలేదు. సాంకేతికంగా ఇందులో 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 154బిహెచ్‌పి పవర్ మరియు 1,700 నుండి 2,700 ఆర్‌పిఎమ్ వద్ద 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

ఇందులో ఉన్న ఇంజన్ 4X4 డ్రైవ్ ద్వారా అన్ని రకాల నిష్పత్తుల్లో పవర్ సరఫరా చేస్తుంది. అంతే కాకుండా, సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్‌లో షిఫ్ట్ ఆన్ ఫ్లై సిస్టమ్ కలదు. అంటే వెహికల్ మూవింగ్‌లో ఉన్నపుడు డ్రైవ్ సిస్టమ్‌ను రియర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందు కోసం గేర్ లీవర్ వద్ద ప్రత్యేకంగా రోటరీ లీవర్ ఉంటుంది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

భారీ ఫీచర్లు, ధృడమైన బాడీ మరియు శక్తివంతమైన ఇంజన్ గల సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఇండియన్ ఆర్మీలో ఉన్న మారుతి సుజుకి జిప్సీ స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తుందని చెప్పవచ్చు.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

లాడర్ ఫ్రేమ్ ఛాసిస్, 200ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ మెకానిజమ్ వంటివి కఠినమైన భూబాగాలను అధిగమించడంలో సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీకి ఎంతగానో సహాయపడతాయి. ప్రస్తుతానికి, బలగాలను రవాణా చేయడానికి మాత్రమే వీటిని వినియోగించనున్నారు, అత్యవసర పరిస్థితుల్లో రహస్య దాడులు చేయడానికి కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

1. ఇండియన్ ఆర్మీ వెహికల్స్ నెంబర్‌ ప్లేట్ల మీద ఉన్న పదాల అర్థం ఏమిటి ?

2.వివిధ రంగుల్లో ఉండే నెంబర్ ప్లేట్లు దేనిని సూచిస్తాయో తెలుసా ?

3.డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఎలా ?

4.ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు

5.5 మరియు 7 సీటింగ్ ఎస్‌యూవీలకు రహదారి పరీక్షలు నిర్వహించిన టాటా

English summary
Rad In Telugu: Tata Safari Storme army edition! Indian Army-spec Tata Safari Storme spied in full glory
Story first published: Friday, April 6, 2018, 14:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark