మారుతి జిప్సీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించిన టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీకి 3,192 యూనిట్ల ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను సరఫరా చేయనుంది. మెరుగైన సస్పెన్షన్, సురక్షితమైన అండర్ బాడీ, 4X4 డ్రైవ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలతో టాటా బృందం దీనిని త

By Anil Kumar

టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీకి 3,192 యూనిట్ల ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను సరఫరా చేయనుంది. మెరుగైన సస్పెన్షన్, సురక్షితమైన అండర్ బాడీ, 4X4 డ్రైవ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలతో టాటా బృందం దీనిని తీర్చిదిద్దింది. సఫారీ స్టార్మ్ సాంకేతికంగా పూర్తి స్థాయిలో సురక్షితమైన వెహికల్‌గా రూపొందించబడింది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

టాటా సఫారీ స్టార్మ్ జిఎస్800 ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన మారుతి జిప్సీ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఆర్మీ పదజాలంలో జిఎస్ అనగా, జనరల్ సర్వీసెస్ అని అర్థం. అదే విధంగా 800 ఆ వాహనం మోయగల మొత్తం బరువును కిలో గ్రాముల్లో కొలుస్తారు.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

ఆర్మీ వర్క్స్ డివిజన్ ఈ వాహనాలలో విభిన్న ప్రదేశాల్లో వినియోగించనుంది. సఫారీ స్టార్మ్ జిఎస్800 వాహనంలో రెండు డోర్ల ఏసి క్యాబిన్ ఉంది. మరియు వెనుక వైపున ఫ్లాట్‌బెడ్ ట్రక్కు ఉంది. ఇందులో సైనికులను మరియు ఇతర సామాగ్రిని తరలిస్తారు. అంతే కాకుండా, వెనుక వైపున యాంటెన్నా మరియు వాహనం మీద ఎత్తైన ప్రదేశంలో బైనాక్యులర్లు ఉన్నాయి.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

టాటా సఫారీ జిఎస్800 ఎస్‌యూవీలో మెకానికల్‌గా కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ వీల్ బేస్ పొడవు తక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా స్టాండర్డ్ 4X4 డ్రైవ్ సిస్టమ్, మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ మరియు ప్రొటెక్టివ్ అండర్‌బాడీ వంటివి ఉన్నాయి.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

సాంకేతికంగా టాటా సఫారీ స్టార్మ్ జిఎస్800 ఆర్మీ ఎడిషన్‌లో 2.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

ఆర్మీ ఎడిషన్ సఫారీలో బార్గ్ వార్నర్ సంస్థ నుండి సేకరించిన 4X4 డ్రైవ్ సిస్టమ్‌లో ఆన్-ది-ఫ్లై షిఫ్ట్ ఫంక్షన్ పీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండానే 2-వీల్ డ్రైవ్ నుండి 4-వీల్ డ్రైవ్‌కు, 4-వీల్ డ్రైవ్ నుండి 2-వీల్ డ్రైవ్‌కు వెహికల్ రన్నింగ్‌లో ఉన్నపుడే మార్చుకోవచ్చు. డ్యాష్ బోర్డ్ మీద ఉన్న రోటరీ డయల్ ద్వారా డ్రైవ్ సిస్టమ్ మార్చుకోవచ్చు.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి జిప్సీ కొన్ని తరాల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలందించింది. పాత మారుతి జిప్సీ స్థానంలో సరికొత్త టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని భర్తీ చేయడానికి ప్రధానం కారణం, ఆర్మీ యొక్క నూతన అవసరాలను జప్సీ తీర్చలేకపోతోంది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్

టెక్నో-క్యామో సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీతో పాటు ఆర్మీ ఉద్యోగులను మరియు మరియు సైనికులను తరలించడానికి మ్యాట్ గ్రీన్ ఫినిషింగ‌లో ఉన్న పర్సనల్ సఫారీ స్టార్మ్ వాహనాలను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.

Source: Financial Express

Most Read Articles

English summary
Read In Telugu: Tata Safari Storme For The Indian Army Revealed: Specifications, Features & Images
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X