టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క పర్ఫామెన్స్ వెర్షన్‌ టియాగో జెటిపి కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుబడింది. టాటా టియాగో జెటిపి పర్ఫామెన్స్ మోడల్‌ను తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వే

By Anil Kumar

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క పర్ఫామెన్స్ వెర్షన్‌ టియాగో జెటిపి కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుబడింది. టాటా టియాగో జెటిపి పర్ఫామెన్స్ మోడల్‌ను తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించారు.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

దేశీయ హ్యాచ్‌బ్యాక్ విపణిలో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడళ్లలో టాటా టియాగో జెటిపి ఒకటి. దీనితో పాటు టియాగో హ్యాచ్‌బ్యాక్ కారుకు కొనసాగింపుగా వచ్చిన టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కూడా జెటిప్ వెర్షన్‌లో విడుదలకు సిద్దమవుతోంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా మోటార్స్ తాజాగా టియాగో జెటిపి పర్ఫామెన్స్ కారును తమిళనాడులోని ఓ జాతీయ రహదారి మీద పరీక్షించింది. ఫ్రంట్ బంపర్, బానెట్ మరియు మ్యానుఫ్యాక్చర్ బ్యాడ్జ్‌ను కప్పేసి టెస్ట్ చేసిన మోడల్ రెగ్యులర్ టియాగోను కాకుండా టియాగో జెటిపి వెర్షన్‌ను తలపిస్తోంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించిన టియాగో మరియు టిగోర్ పర్ఫామెన్స్ మోడళ్లలో ఫ్రంట్ గ్రిల్ మీద జెటిపి బ్యాడ్జ్, ఎరుపు రంగులో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు గ్లాస్ బ్లాక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

అయితే, ప్రస్తుతం పరీక్షిస్తున్న మోడల్‌లో ఈ ఫీచర్లు మిస్సయ్యాయి. కాస్మొటిక్ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా, ప్రొడక్షన్ దశకు చేరుకున్నాక ఆ ఎక్ట్సీరియర్ కలర్ అప్‌డేట్స్ బ్యాడ్జ్ వచ్చే అవకాశం ఉంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా మోటార్స్ మరియు కోయంబత్తూరుకు చెందిన జయేం ఆటోమోటివ్స్ లేదా జెటి స్పెషల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో జెటిపి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా టియాగో మరియు టిగోర్ మోడళ్లను జెటిపి వెర్షన్‌లో సిద్దం చేశారు. జెటిపి అనగా.. జయేం టాటా పర్ఫామెన్స్ అని అర్థం.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా టియాగో మరియు టిగోర్ జెటిపి వెర్షన్‌లలో పెద్ద పరిమాణంలో ఉన్న ఫాగ్-ల్యాంప్స్ గల ఫ్రంట్ బంపర్, ఎయిర్ వెంట్ గల బానెట్ మరియు స్మోక్డ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా టియాగో సైడ్ డిజైన్ విషయానికి వస్తే, జెటిపి బ్యాడ్జ్ గమనించవచ్చు. అంతే కాకుండా, 15-అంగుళాల పరిమాణంలో ఉన్న 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

రెగ్యులర్ టియాగో రియర్ డిజైన్‌లో ఉండే స్ల్పిట్ స్పాయిలర్ కాకుండా, టాటా టియాగో జెటిపి రియర్ డిజైన్‌లో ఫుల్ స్పాయిలర్ ఉంది. బంపర్ కూడా చాలా అగ్రెసివ్ డిజైన్‌లో ఉంది మరియు బంపర్‌కు ఇరువైపులా డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టియాగో జెటిపి ఇంటీరియర్ ఓవరాల్ థీమ్ బ్లాక్ కలర్‌‌లో ఉంటుంది. అక్కడక్కడా ఎరుపు రంగు సొబగులు ఉన్నాయి. 8-స్పీకర్ల హార్మన్ ఆడియో సిస్టమ్ అనుసంధానంతో ఉన్న సరికొత్త టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అల్యూమినియం-ఫినిషింగ్ పెడల్స్ ఉన్నాయి.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

సాకేతికంగా టాటా టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడళ్లలో 1.2-లీటర్ కెపాసిటి గల టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లో కూడా ఇంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍‌‌బాక్స్ అనుసంధానం గల ఈ పర్ఫామెన్స్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ టియాగో మరియు టిగోర్ మోడళ్లలోని పెట్రోల్ ఇంజన్ పనితీరు కంటే ఇది చాలా ఎక్కువ. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతి కోసం ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా టియాగో జెటిపి పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న మారుతి బాలెనో ఆర్ఎస్, వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మరియు ఫియట్ అబర్త్ పుంటో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. దీనికి పోటీగా ఉన్న మోడళ్లతో పోల్చితే అత్యంత సరసరమైన ధరలో విడుదలవ్వనుంది.

టాటా టియాగో జెటిపి వెర్షన్‌కు రహస్య పరీక్షలు

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు మరిన్ని టియాగో ఆధారిత ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి టాటా సిద్దమైంది. అందులో భాగంగానే, టియాగో మరియు టిగోర్ కార్లను పర్ఫామెన్స్ వెర్షన్‌లో జెటిపి మోడళ్లను విడుదలకు సిద్దం చేసింది. డ్రైవింగ్ ఫీల్ పొందాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వీటిని డెవలప్‌ చేసింది.

Source: OVERDRIVE

More from DriveSpark

Article Published On: Wednesday, May 30, 2018, 15:46 [IST]
English summary
Tata Tiago JTP Hot-Hatch Spotted Testing On Public Roads — Launch Imminent?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+