ఆటో ఎక్స్‌పో 2018: జెటిపి వెర్షన్ టియాగో మరియు టిగోర్ కార్లను ఆవిష్కరించిన టాటా మోటార్స్

Written By:
Recommended Video - Watch Now!
New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద స్పోర్టివ్ వెర్షన్ టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఆవిష్కరించింది. టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి వెర్షన్‌లను ప్రదర్శించింది.

జెటిపి వెర్షన్ అంటే ఏమిటి, రెగ్యులర్ టియాగో మరియు టిగోర్ కార్లకు జెటిపి వెర్షన్ కార్లు ఉన్న తేడా... ఇంకా ఎన్నో వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

ఆటోమొబైల్ విడి భాగాల తయారీ దిగ్గజం జయేం ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను టియోగో జెటిపి మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును టిగోర్ జెటిపి స్పోర్ట్స్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

జయేం మరియు టాటా సంస్థ ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందించడం వలన జయేం "టాటా పర్ఫామెన్స్"(JTP) బ్యాడ్జ్‌ను జోడించడం జరిగింది. రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే వీటి ఎక్ట్సీరియర్‌లో అదనపు రంగుల మేళవింపులు ఉన్నాయి.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి వెర్షన్ కార్లలో టాటా నెక్సాన్ నుండి సేకరించిన 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. అత్యుత్తమ పవర్ కోసం ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం జరిగింది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

జయేం భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ వ్యవస్థ గరిష్టంగా 109బిహెచ్‌పి పవర్ మరియు 150ఎమ్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ 1.2-లీటర్ ఇంజన్ మరియు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ ఇంజన్ కంటే ఇది అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

అంతే కాకుండా, టాటా మోటార్స్ టియోగో మరియు టిగోర్ కార్లలోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లోని గేరే రేషియాను మరింత అనుకూలంగా రూపొందించినట్లు పేర్కొంది. ఏదేమైనప్పటి వీటి పర్ఫామెన్స్ నెంబర్లను వెల్లడించలేదు. సస్పెన్స్ మెరుగుపరచడం కోసం తక్కువ ఎత్తున్న స్ప్రింగ్‌లను ఉపయోగించడంతో ఎత్తు కూడా తగ్గింది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి వెర్షన్ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ ఎయిర్ ఇంటేకర్, ఎర్రటి సొబగులు ఉన్న ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బానెట్ మీద ఎయిర్ వెంట్స్, పొగచూరిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సైడ్ స్కర్ట్, రియర్ డిఫ్యూసర్ వంటి భాగాలను చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దారు.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

వీల్ సైజులో ఎలాంటి మార్పులు జరపలేదు. అదే 15-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్‌ను డైమండ్ కట్ ఫినిషింగ్‌లో అందివ్వడంతో రెగ్యులర్ వీల్స్ కంటే భిన్నంగా ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు మరియు వెనుక రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులు అందివ్వడం జరిగింది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి ఇంటీరియర్‌లో బ్లాక్-థీమ్, ఖరీదైన లెథర్ ఫినిషింగ్ గల సీట్లు, స్టీరింగ్ వీల్ మరియు అల్యూమినియం పెడల్స్ ఉన్నాయి. అంతే కాకుండా సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 8-స్పీకర్ల హార్మన్ మ్యూజిక్ సిస్టమ్‌తో కలిపి అందించింది.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెండు కార్లు కూడా చూడటానికి చాలా స్పోర్టివ్ శైలిలో ఉన్నాయి. డ్రైవింగ్ ఇష్టపడే ఔత్సాహికులకు ఈ రెండు కార్లు అత్యుత్తమ రైడ్ మరియు హ్యాడ్లింగ్ కల్పిస్తాయి. టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి కార్లు ఇటు కంపెనీకి, అటు కస్టమర్లకు బాగా నమ్మకమైన మోడళ్లు. కస్టమర్లు అధిక మైలేజ్ ఇచ్చే రెగ్యులర్ టియాగో లేదా అత్యుత్తమ పర్ఫామెన్స్ ఇచ్చే జెటిపి వెర్షన్ స్పోర్టివ్ టియాగోను ఎంచుకోవచ్చు.

టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి

బాంబు పేల్చిన మారుతి: అద్భుతమైన మైలేజ్, అదిరే ఫీచర్లతో చీపెస్ట్ స్విఫ్ట్ విడుదల

ఈ కారుతో మారుతి డిజైర్ పతనం ఖాయం

సంచలనాత్మక ఎస్‌యూవీని ఆవిష్కరించిన టాటా మోటార్స్

45X ఆవిష్కరణతో మారుతి, హ్యుందాయ్‌కు సవాల్ విసిరిన టాటా

హోండా యాక్టివా 5G స్కూటర్ ఆవిష్కరణ: ఇవీ ప్రత్యేకతలు!

English summary
Read In Telugu: Auto Expo 2018: Tata Tiago JTP & Tigor JTP Unveiled - The Sporty Versions Of The Tiago & Tigor

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark