టాటా టియాగో దెబ్బకు ఆ రెండు కార్ల మీద ఆశలు వదులుకుంటున్న మారుతి

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న తన పోటీదారులైన మారుతి సెలెరియో, ఇగ్నిస్ మరియు రెనో క్విడ్ మోడళ్లను సేల్స్ పరంగా వెనక్కి నెట్టింది. టాటా మోటార్స్ జూన్ 2018 నెలలో 56,773 విక్రయాలతో 54 శాతం వృద

By Anil Kumar

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న తన పోటీదారులైన మారుతి సెలెరియో, ఇగ్నిస్ మరియు రెనో క్విడ్ మోడళ్లను సేల్స్ పరంగా వెనక్కి నెట్టింది. టాటా మోటార్స్ జూన్ 2018 నెలలో 56,773 విక్రయాలతో 54 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. ఎప్పటిలాగే టాటా టియాగో కంపెనీ యొక్క్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

టాటా టియాగో సేల్స్

పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది...

టాటా టియాగో తన అద్భుతమైన సేల్స్‌తో కంపెనీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. గడిచిన జూన్ 2018లో 8,237 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుని టాటాకు అత్యధిక విక్రయాలు సాధించి టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది.

టాటా టియాగో సేల్స్

ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో ఆల్టో మరియు స్విఫ్ట్ కార్ల మద్య దూరాన్ని భర్తీ చేస్తూ మారుతి సుజుకి సెలెరియో మరియు ఇగ్నిస్ కార్లను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో ఈ రెండు మోడళ్ల ఏకఛత్రాధిపత్యానికి టాటా టియాగో చరమగీతం పాడింది. ఇదే జూన్ నెలలో సెలెరియో 6,570 యూనిట్లు మరియు ఇగ్నిస్ 4,514 యూనిట్ల సేల్స్‌తో టాటాను అందుకోలేకపోయాయి.

టాటా టియాగో సేల్స్

చిన్న కార్లనూ వదల్లేదు

మారుతి కార్లతో పాటు జూన్ 2018 నెలలో 4,939 యూనిట్ల సేల్స్ సాధించిన రెనో క్విడ్ మరియు 4,270 యూనిట్ల విక్రయాలు జరిపిన హ్యుందాయ్ ఇయాన్ కార్లను కూడా వెనక్కి నెట్టింది. ఏదేమైనప్పటికీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో టాటా టియాగో సంచలనాత్మక విజయాన్ని అందుకొంది.

టాటా టియాగో సేల్స్

ఆల్టో, వ్యాగన్ఆర్ కార్ల మీద ప్రభావం

మారుతి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో ఇగ్నిస్ మరియు సెలెరియో తరువాత ఆల్టో మరియు వ్యాగన్ఆర్ మోడళ్లకు టాటా టియాగో సేల్స్ సెగ బాగానే తగులుతోంది. వీటిని ఎంచుకోవాల్సిన కస్టమర్లు ఇప్పుడు టియాగో మీదకు మనసు మార్చుకుంటున్నారు.

టాటా టియాగో సేల్స్

పెరుగుతున్న మహిళా కస్టమర్లు

టాటా టియాగో కార్లను ఎంచుకుంటున్న వారిలో మహిళా కస్టమర్లు క్రమక్రమంగా పెరుగుతున్నారు. టియాగో యొక్క ఖచ్చితమైన పనితీరు, విశ్వసనీయమైన నిర్మాణ నాణ్యత మరియు డ్రైవింగ్ క్వాలిటీ ఇలా ఎన్నో అంశాల పరంగా బెస్ట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ కారుగా నిరూపించుకుంది.

టాటా టియాగో సేల్స్

నెలనెలా పెరుగుతున్న విక్రయాలు

టాటా మోటార్స్ తమ పోటీదారులు ఉత్పత్తుల కంటే టియాగో కారు మీద ప్రతి నెలా సేల్స్ పెరగడాన్ని గమనించింది. నిజమే, టాటా టియాగో ఇప్పటి వరకు జరిపిన విక్రయాల్లో జూన్ నెల సేల్స్ అత్యధికం. దీనికి తోడు దీని ప్రధాన పోటీదారులను కూడా ఇదే నెలలో వెనక్కి నెట్టింది.

టాటా టియాగో సేల్స్

టాటా టియాగో ప్రారంభ ధర రూ. 4.1 లక్షలు. కానీ మారుతి సెలెరియో ధర రూ. 4.32 లక్షలు, ఇగ్నిస్ ధర రూ. 4.72 లక్షలు మరియు వ్యాగన్ఆర్ ధర రూ. 4.29 లక్షలు. టియాగోతో పోల్చుకుంటే ఈ మూడింటి ధరలు ఎక్కువే. టాటా నిర్మాణ నాణ్యత మరియు ఫీచర్ల పరంగా వీటిలో ఏ మోడల్ కూడా టియాగో గట్టి పోటీనివ్వలేవు.

టాటా టియాగో సేల్స్

పర్ఫామెన్స్ ప్రియుల కోసం...

టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును పర్ఫామెన్స్ ప్రియుల కోసం శక్తివంతమైన ఇంజన్‌తో టియాగో జెటిపి వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. టాటా తమ టియాగో జెటిపి మోడల్‌‌కు ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు జరుపుతోంది. బహుశా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

టాటా టియాగో సేల్స్

దశ మార్చిన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ

టాటా మోటార్స్ పాత మోడళ్లతో జపాన్ మరియు ఫ్రెంచ్ దిగ్గజాలు విక్రయిస్తున్న కార్లతో పోటీపడలేకపోయింది. దివాళా తీసే పరిస్థితుల్లో చివరి ప్రత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించి భారీ విజయాన్ని అందుకుంది. మార్కెట్లోకి విడుదలయ్యి సుమారు రెండేళ్లు కావస్తోంది, ఎలాంటి అప్‌డేట్స్ లేకపోయిన చక్కటి ఫలితాలు సాధిస్తోంది.

టాటా టియాగో సేల్స్

కొనసాగింపుగా మరో మూడు మోడళ్లు

టియాగో హ్యాచ్‌బ్యాక్ మోడల్ అందుకున్న విజయానికి కొనసాగింపుగా... కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వితారా బ్రిజాకు పోటీగా నెక్సాన్ ఎస్‌యూవీ, మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి మహీంద్రా ఎక్స్‌‌యూవీ500కు పోటీగా హెక్సా ఎస్‌యూవీని మరియు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టిగోర్ కార్లను లాంచ్ చేసి అన్నింటి పరంగా విజయాన్ని అందుకుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Tiago beats Maruti Celerio and Ignis
Story first published: Wednesday, July 11, 2018, 17:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X