టియాగో & టిగోర్ కార్లలో నూతన అప్‌డేట్స్‌తో దడ పుట్టిస్తున్న టాటా

టాటా కస్టమర్లను ఆకట్టుకునేందుకు టియాగో మరియు టిగోర్ కార్లలో మరో కొత్త కలర్ స్కీమ్ పరిచయం చేసింది. టాటా టియాగో మరియు టిగోర్ కార్లలో సరికొత్త టైటానియం గ్రే కలర్‌ను పరిచయం చేసింది.

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

దీవాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు టాటా మోటార్స్ విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు టాటాకు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ రెండు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

ఇదే జోరు మీద ఉన్న టాటా కస్టమర్లను ఆకట్టుకునేందుకు టియాగో మరియు టిగోర్ కార్లలో మరో కొత్త కలర్ స్కీమ్ పరిచయం చేసింది. అంతే కాకుండా టాటా వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

టాటా టియాగో మరియు టిగోర్ కార్లలో సరికొత్త టైటానియం గ్రే కలర్‌ను పరిచయం చేసింది. అంతే కాకుండా ఈ రెండు కార్లు ఇది వరకు లభించే స్ట్రైకర్ బ్లూ రంగును తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

మునుపటి స్ట్రైకర్ బ్లూ స్థానంలోకి టైటానియం గ్రే కలర్ స్కీమ్ జోడించడం మినహాయిస్తే, టియాగో మరియు టిగోర్ కార్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ రెండు కార్లు ఇప్పుడు మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నాయి. అవి, బెర్రీ రెడ్, ఎస్‌ప్రెస్సో బ్రౌన్, టైటానియం గ్రే, ప్లాటినమ్ సిల్వర్, పర్ల్‌సెంట్ వైట్.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

ఇక్కడ గుర్తించవలసిన మరో అంశం, టియాగో మరియు టిగోర్ లభించే ఎక్స్‌బి మరియు ఎక్స్ఇ వేరియంట్లలో ఈ టైటానియం గ్రే రంగు లభించలేదు. టాటా మార్కెట్ విలువను పెంచడానికి దోహదపడిన ఈ రెండు కార్లలో అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

సాంకేతికంగా టియాగో మరియు టిగోర్ కార్లలో ఉన్న 1.2-లీటర్ రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యమవుతోంది.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

అదే విధంగా వీటిలోని 1.05-లీటర్ కెపాసిటి గల రివోటార్క్ డీజల్ ఇంజన్ 70బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

టాటా మోటార్స్ భద్రత పరంగా టియాగో మరియు టిగోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందించింది. అయితే, కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతున్నాయి.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

టాటా మోటార్స్‌కు టియాగో మరియు టిగోర్ నుండి లభించిన విజయంతో స్పోర్టివ్ మరియు ఎలక్ట్రిక్ అనే రెండు విభిన్న వెర్షన్‌‌లలో ఈ రెండు కార్లను విడుదల చేయాలని చూస్తోంది. స్పోర్టివ్ వెర్షన్‌లో టియాగో మరియు టిగోర్ కార్లలో నెక్సాన్ సేకరించిన పవర్‌ఫుల్ ఇంజన్ అందిస్తోంది. అదే విధంగా ఈ రెండింటిన ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందిన్వనుంది.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

టాటా టియాగో విపణిలో ఉన్న మారుతి సుజుకి సెలెరియో మరియు వ్యాగన్ఆర్ కార్లకు, అదే విధంగా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో ఉన్న న్యూ మారుతి డిజైర్, హోండా అమేజ్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ కార్లకు గట్టి పోటీనిస్తున్నాయి.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

టాటా టియాగో ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.26 లక్షలు మరియు టాటా టిగోర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.71 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. రెండు కార్ల ధరలు కూడా పోటీగా ఉన్న ఇతర మోడళ్లలోని ప్రారంభ వేరియంట్ల ధరల కంటే తక్కువగా ఉన్నాయి.

టియాగో మరియు టిగోర్ కార్లలో కొత్త కలర్ స్కీమ్ పరిచయం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా పరిచయం చేసిన టైటానియం గ్రే సాధారణంగా అందరికీ గ్రాఫైట్ గ్రే కలర్‌గా తెలుసు. ఫోర్-వీలర్స్ సెగ్మెంట్లో తెలుపు తరువాత ఎక్కువగా ఎంచుకుంటున్న రంగు ఇదే. ఎక్కువ ఆదరణ ఉన్న గ్రే కలర్ పరిచయం చేయడంతో అతి ముఖ్యమైన టియాగో మరియు టిగోర్ కస్టమర్లను చేరుకోనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2018, 15:38 [IST]
English summary
Read In Telugu: Tata Tiago & Tigor Get New Colour Option; Replaces The Striker Blue Paint Scheme
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+