TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టాటా టిగోర్ బజ్ ఎడిషన్‌ను సిద్దం చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ భారతదేశపు చీపెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కారుగా అందుబాటులో ఉంచిన టాటా టిగోర్ స్టైల్‌బ్యాక్ కారును బజ్ ఎడిషన్‌లో సిద్దం చేసింది. అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో టిగోర్ బజ్ ఎడిషన్ ఫోటోలు మరియు వీడియో రహస్యంగా లీక్ అయ్యాయి.
టాటా టిగోర్ రెగ్యులర్ వెర్షన్ మిడ్ వేరియంట్ ఆధారంగా బజ్ ఎడిషన్‌ను సిద్దం చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఫీచర్లు మరియు ఎక్ట్సీరియర్ కాస్మొటిక్స్ పరంగా పలు మార్పులు జరిగాయి.
వీడియోలో రికార్డయిన ఫుటేజ్ మేరకు, టాటా టిగోర్ బజ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లో బ్లాక్ రూఫ్ టాప్, వింగ్ మిర్రర్ హౌసింగ్స్ మరియు రియర్ డిజైన్‌లో డిక్కీ మీద బజ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ గుర్తించవచ్చు.
టాటా టిగోర్ బజ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఏ/సి వెంట్స్ చుట్టూ ఎరుపు రంగు సొబగులు, డ్యాష్ బోర్డు మీద స్పెషల్ రెడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరియు ఇంటీరియర్‍లో పలు చోట్ల బజ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ ఉంది. డ్యాష్‍బోర్డులో ఉన్న హార్మన్ కంపెనీకి చెందిన నాన్-టచ్‌స్క్రీన్ స్టీరియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా టిగోర్ మిడ్ వేరియంట్‌కు మెరుగులద్ది బజ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిసింది.
సాంకేతికంగా టాటా టిగోర్ బజ్ ఎడిషన్ స్టైల్‌బ్యాక్ సెడాన్ 84బిహెచ్‌పి-114ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ 3 సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 70బిహెచ్‌పి-140ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేసే 1.1-లీటర్ కెపాసిటి గల 3-సిలిండర్ల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది.
టాటా టిగోర్ బజ్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి. టాటా టిగోర్ ప్రారంభ ధర 5 లక్షల లోపు ఉండటంతో భారతదేశపు అత్యంత సరసమైన కాంపాక్ట్ సెడాన్ కారుగా మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఇతర కాంపాక్ట్ సెడాన్ కార్లతో పోల్చుకుంటే టాటా టిగోర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మరియు ధరకు తగ్గ విలువలు దీని సొంతం. ముందు నుండి చూసినపుడు టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. అయితే, రియర్ డిజైన్ చాలా విభిన్నంగా ఉంటుంది.
అంతే కాకుండా, విభిన్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ టిగోర్ సెడాన్ కారును పర్ఫామెన్స్ వెర్షన్‌లో పరిచయం చేయనుంది. కోయంబత్తూరుకు చెందిన జయేం ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో పర్ఫామెన్స్ టిగోర్ కారును టిగోర్ జెటిపి పేరుతో లాంచ్ చేయనుంది.
టియాగో పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కారును టియాగో జెటిపి వెర్షన్‌లో విడుదల చేయనుంది. టియాగో మరియు టిగోర్ రెండు మోడళ్లు కూడా రెగ్యులర్ వేరియంట్ల కంటే ఎక్కువ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి పూర్తి స్థాయిలో విడుదలైతే, భారతదేశపు అత్యంత సరసమైన పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ సెడాన్ కార్లుగా నిలవనున్నాయి.
Source: Arunraj.Rajasekharannair