టాటా టిగోర్ వేరియంట్ల లిస్ట్: ఫీచర్లు మరియు విడుదల వివరాలు

Written By:

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2018లో టియాగో ఎలక్ట్రిక్ వెహికల్‌తో పాటు టిగోర్ స్టైల్‌బ్యాక్ సెడాన్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. రెగ్యులర్ టిగోర్ సెడాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ ఆధారంగా టాటా మోటార్స్ ఈ టిగోర్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసింది.

Recommended Video - Watch Now!
Auto Expo 2018: Mahindra KUV100 Electric Launch Details, Specifications, Features - DriveSpark
టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

తాజాగా, టిగోర్ ఎలక్ట్రిక్ కారు లభ్యమయ్యే వేరియంట్లకు సంభందించిన అధికారిక డ్యాక్యుమెంట్ ఒకటి రహస్యంగా లీక్ అయ్యింది. టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ లభించే వేరియంట్లు మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి....

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

టాటా టిగోర్ ఇవి కారు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, ఎక్స్ఇ, ఎక్స్ఎమ్ మరియు ఎక్స్‌టి. టిగోర్ ఎలక్ట్రిక్ కారులో ఫీచర్ల పరంగా ఫ్రంట్ గ్రిల్ మీద క్రోమ్ స్ట్రిప్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, రెండుగా విభజించబడిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు వెనుక వైపు అద్దానికి పైభాగంలో అందించిన ఎల్ఇడి స్టాప్ ల్యాంప్ కలదు.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు టాప్ ఎండ్ వేరియంట్లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఎల్ఇడి టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

భద్రత పరంగా టిగోర్ రెగ్యులర్ వెర్షన్ తరహాలో ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, పార్కింగ్ సెన్సార్లు మరియు పార్కింగ్ కెమెరా ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

సాంకేతికంగా టాటా టిగోర్ ఇవి కారులో 40బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ కలదు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఎలక్ట్రా ఇవి సంస్థ అభివృద్ది చేసింది. దీనికి 216mAh బ్యాటరీ నుండి పవర్ సరఫరా అవుతుంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

టాటా టిగోర్ ఇవి ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 130కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 100కిలోమీటర్లుగా ఉంది. స్టాండర్డ్ ఛార్జర్‌తో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 90 నిమిషాలలో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ ఇప్పటికే తమ టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వ రంగ సంస్థ ఇఎస్ఎస్ఎల్(ESSL)కు సరఫరా చేస్తోంది. అయితే, ఇప్పటి వరకు భారత్‌లో టిగోర్ ఇవి విడుదల గురించి టాటా ఎలాంటి ప్రకటన చేయలేదు. దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటే టిగోర్ ఇవి కారును విడుదల చేస్తామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరక్టర్ గుంటెర్ బట్స్‌‌చెక్ గతంలో పేర్కొన్నారు.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వాహన కాలుష్యాన్ని తగ్గించడం మరియు భారత్‌లో పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వినియోగాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే దిశగా భారత ప్రభుత్వం ప్రజలను చైతన్యపరుస్తోంది. ఇందుకు అనుగుణంగా పలు కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల పరిజ్ఞానాన్ని అభివవృద్ది చేసుకుంటాన్నాయి.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు

అందులో దేశీయ అగ్రగామి సంస్థ టాటా మోటార్స్ టియాగో మరియు టిగోర్ కార్లను ఎలక్ట్రిక్ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసి, ఆటో ఎక్స్ పో 2018లో కూడా ఆవిష్కరించింది. టాటా తమ టిగోర్ ఎలక్ట్రిక్ కారును 2018 చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Source: IAB

English summary
Read In Telugu: Tata Tigor EV Trim Levels Leaked; Specifications, Features & Images
Story first published: Monday, March 12, 2018, 13:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark