TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టాటా జెస్ట్ ప్రీమియో ఎడిషన్ విడుదల: ధర రూ. 7.53 లక్షలు

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త జెస్ట్ ప్రీమియో ఎడిషన్(Tata Zest Premio Edition) కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది. టాటా జెస్ట్ ప్రీమియో ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.53 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
టాటా మోటార్స్ ఇప్పటి వరకు 85,000 యూనిట్ల జెస్ట్ కార్లను విక్రయించిన సందర్భాన్ని పురస్కరించుకుని జెస్ట్ ప్రీమియో ఎడిషన్ కారును విడుదల చేసింది. ఇది విపణిలో ఉన్న జెస్ట్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌టి(XT) క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది.
టాటా జెస్ట్ ప్రీమియో కాంపాక్ట్ ఎడిషన్ రెగ్యలర్ మోడల్ కంటే 13 అదనపు ఫీచర్లు వచ్చింది. మరియు ఇది కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. టైటానియం గ్రే మరియు ప్లాటినమ్ సిల్వర్ అనే రెండు కొత్త కలర్ స్కీమ్‌లలో కూడా లభిస్తోంది.
టాటా జెస్ట్ ప్రీమియో ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లో గ్లోజీ బ్లాక్ డ్యూయల్ టోన్ రూఫ్, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు ఉన్నాయి. మరియు ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్ మీద ట్యాన్ ఫినిషింగ్ గల మిడ్ ప్యాడ్ ఉంది.
ఆప్షనల్‌గా, బ్లాక్ బూట్ స్పాయిలర్, సిల్వర్ ఫినిషింగ్ వీల్ క్యాప్స్ గల 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఎంచుకోవచ్చు. జెస్ట్ ప్రీమియో రియర్ డిజైన్‌లో పియానో బ్లాక్ బూట్ లిడ్ మరియు స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ ఉన్నాయి.
ఇతర ఎక్ట్సీరియర్ అప్‌గ్రేడ్స్‌లో స్మోక్డ్ మల్టీ-రెఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఫ్రంట్ డ్యూయల్ టోన్ బంపర్ మీద పియానో బ్లాక్ హుడ్ స్ట్రిప్ వచ్చింది. ఇంటీరియర్‌లో ప్రకాశవంతమైన దారంతో కుట్టబడిన ఫ్యాబ్రిక్ సీట్లు మరియు డ్యాష్‌బోర్డ్ మధ్యలో ప్రీమియో బ్యాడ్జింగ్ ఉంది.
సాంకేతికంగా, టాటా జెస్ట్ ప్రీమియో ఎడిషన్ కాంపాక్ట్ సెడాన్‌లో అదే 1.3-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ప్రీమియో ఎడిషన్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఎక్స్ఎమ్ వేరియంట్ నుండి సేకరించిన హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు న్యావిగేషన్ సిస్టమ్ కలదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి విడుదల చేసిన టిగోర్ స్టైల్ బ్యాక్‌తో పోల్చుకుంటే టాటా జెస్ట్ వయసు అయిపోతున్న మోడల్. అయినప్పటికీ, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు శక్తివంతమైన ఇంజన్ మరియు పలు ఇంటీరియర్ ఫీచర్లతో ఎంతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ఈ తరుణంలో టాటా తమ జెస్ట్ కారును స్వల్ప అప్‌డేట్స్‌తో ప్రీమియో ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఇది విపణిలో ఉన్న మారుతి డిజైర్, వోక్స్‌వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మరియు హోండా అతి త్వరలో విడుదల చేయనున్న హోండా అమేజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.