తప్పు చేసిన అధికారిని కూడా వదలని ట్రాఫిక్ పోలీసులు..
ట్రాఫిక్ రూల్స్ విషయానికి వస్తే అది అందరికి అన్వయం అవుతుంది. చట్టం ముందు అందరూ సమానులే. జనసామాన్యులు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయలేదంటే వాళ్ళను ఆపి, చేసిన తప్పుకు ఫైన్ వేసేందుకు ట్రాఫిక్ పోలిసులు ఉన్నారు. కానీ పోలీసులే ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయలేదంటే వారిసి శిక్షించే వారు ఎవరు.?

దేశంలో చాలా చోటులలో పోలిసులు మరియు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సమయాలలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, సోషియల్ మీడియాలలో చర్చకు గురి అయినా సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతే ఎందుకు కొన్ని సార్లు రాజకీయ వ్యక్తులు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చెయ్యకుండా ఉన్నందుకు వారిని సైతం వదలకుండా ఫైన్ వేసిన ఘటనను మేము చూసే ఉన్నాం.

కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విచారం ఒకటి చోటు చేసుకుంది. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ కమిషనర్ కారు నో-పార్కింగ్ స్థలంలో నించున్న ఫోటో ఒకటి చిక్కింది. నో-పార్కింగ్లో ఉన్న కారుకు ఎలాంటి దండన వేస్తారు అనేదానిగురించి సోషియల్ మీడియాలో వైరల్గా మారింది.
అవును, తెలంగాణ రాజధాని హైదెరాబాద్ నగరంలో ఉన్న మహాంకాళి పోలీస్ స్టేషన్ రోడ్డులో, పోలీస్ కమిషనర్ వారి ఆఫిషియల్ పనుల కోసం వాడే టొయోటా ఫార్చ్యూనర్ కారు నో-పార్కింగ్లో పార్కింగ్ చేశారు. దీని ఫోటో క్లిక్ చేసిన ఒక మీడియా వ్యక్తి తమ ట్విటర్ అకౌంట్లో ఈ వ్యక్తికి ఎలాంటి శిక్షలను విధించనున్నారు అని ప్రశ్నించారు.

జర్నలిస్ట్ అభినవ్ దేశ్పాండే క్లిక్ చేసి పోస్ట్ చేసిన ట్వీట్ లో, ఈ ఘటన జరిగిన స్థలం మరియు సమయాన్ని ఉల్లేఖించబడింది. దీనితో పాటు ‘నో-పార్కింగ్' చలన్ ఇచ్చి ఫైన్ వేస్తారా అని ట్రాఫిక్ పోలీసులను అడిగాడు.

దీనికి లెట్ చెయ్యకుండా స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మేము ఎన్ని తప్పితస్థులను సమానంగా చూస్తాము అని రాయటమే కాకుండా, రూ.235 ఫన్ వేసినట్లు ప్రామాణికంగా ఇచ్చిన ఇ-చలన్ ఫొటోతో ద్వారా రిప్లై ఇచ్చారు.

నో-పార్కింగ్లో పార్క్ చెయ్యబడిన టొయోటా ఫార్చ్యూనర్ కారు వాస్తవానికి తెలంగాణ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు చేరింది అని తెలిసింది మరియు, పోలీస్ కమిషనర్ ఈ వాహనాన్ని మహాంకాళి పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్షన్కు వచ్చినప్పుడు అక్కడ పార్కిన్గ్ చేశారు అనే విచారం తెలిసింది.

ఇంతె కాకుండా పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము. కానీ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఈ ఫైన్ కట్టేది ఎవరు.? ఒకవైపుగా చూస్తే ఈ కారు ప్రభుత్వానికి చెందింది. ఐతే దీనికి పవ్వబడిన ఫైన్ కట్టేవారు ఎవరు.?

ప్రభుత్వం అంటే అది ప్రజల డబ్బులేకదా, అంటే పోలీస్ కమిషనర్ చేసిన తప్పుకు ప్రజలే ఫైన్ కట్టాలా? ఈ ఐపీఎస్ అధికారి మీదా కూడా చట్టరికంగా శిక్ష పడాలని మరొక్క ట్వీట్ వేరే వ్యక్తినుండి చెయ్యబడింది.

ఇపుడు నో-పార్కిన్గ్ లో పార్క్ చెయ్యబడిన టొయోటా ఫార్చ్యూనర్ కారుకు వేసిన ఫైన్ కట్టాశారు, మరియు దీని పరంగా చేసిన ట్వీట్స్ మరియు పోస్థులను శాశ్వతముగా తొలిగించినట్లు సమాచారం అందింది.


Click it and Unblock the Notifications








