మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీని తొక్కేసిన టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ అడ్డూఅదుపులేని విక్రయాలతో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీ వాహనంగా ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. అవును, దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న చౌకైన మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీని సైతం అ

By Anil Kumar

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ అడ్డూఅదుపులేని విక్రయాలతో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీ వాహనంగా ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. అవును, దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న చౌకైన మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీని సైతం అమ్మకాల్లో వెనక్కి నెట్టేసింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

7-సీటర్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ప్రస్తుతం మారుతి ఎర్టిగా మరియు రెనో లాజీ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు వాహనాల ప్రారంభ ధరలు ఇన్నోవా క్రిస్టా మొత్తం ధరలో సగానికి సమానం. అయినప్పటికీ, ఇండియన్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టానే ఆధిపత్యం సాధిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

అంతే కాకుండా, టయోటా ఇండియా లైనప్‌లో ఇన్నోవా క్రిస్టా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రాణిస్తోంది. టయోటా విక్రయిస్తున్న ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మరియు ఇటీవల విడుదల చేసిన యారిస్ సెడాన్ కార్ల కంటే అత్యధిక విక్రయాలు సాధిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీని వ్యక్తిగత మరియు అద్దె కార్ల నిర్వహణ రెండు అవసరాలకు అత్యధికంగా ఎంచుకుంటున్నారు. ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ. 14.33 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇండియాలో అత్యంత ఖరీదైన ఎమ్‌పీవీ కూడా ఇదే.

టయోటా ఇన్నోవా క్రిస్టా

ధర అత్యధికంగా ఉన్నప్పటికీ, కస్టమర్లు ఎక్కువగా ఇన్నోవా క్రిస్టా వాహనాన్నే ఎంచుకుంటున్నారు. గడిచిన జూలై 2018లో దేశవ్యాప్తంగా 6,638 యూనిట్ల ఇన్నోవా క్రిస్టా వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో భారతదేశపు అత్యంత చౌకైన మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ 4,764 యూనిట్ల సేల్స్ సాధించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్‌పీవీని అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఎర్టిగా సేల్స్ తగ్గిపోవడానికి బహుశా ఇదీ ఒక కారణం కావచ్చు. అయితే, అత్యంత ఖరీదైన ఇన్నోవా క్రిస్టా ఈ తరహా విక్రయాలు సాధించడనాన్ని మార్కెట్ నిపుణులు నమ్మలేకపోతున్నారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా

ఎమ్‌పీవీ అంటే అత్యంత విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్ గల 7 నుండి 8 మంది వరకు ప్రయాణించే వాహనం. ఎర్టిగా‌తో పోల్చుకుంటే ఇన్నోవా క్రిస్టా భారతదేశపు అసలైన ఎమ్‌పీగా నిరూపించుకుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

అంతే కాకుండా, బాంబు దాడులను సైతం ఎదుర్కునే సామర్థ్యం గల నిర్మాణ నాణ్యత, అతి తక్కువ నిర్వహణ భారం ఉండటంతో క్యాబ్ డ్రైవర్లను, అదే విధంగా విలాసవంతమైన అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు పలు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో వ్యక్తిగత వాహనంగా ఎంచుకునే కస్టమర్లను ఇన్నోవా క్రిస్టా అమితంగా ఆకట్టుకుంటోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

ప్రస్తుతం, టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ మరియు 2.8-లీటర్ సామర్థ్యం గల టర్భోఛార్జ్‌డ్ డీజల్ మరియు 2.7-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

తక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అదే విధంగా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి. ఇన్నోవా క్రిస్టా అన్ని వేరియంట్లలో రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా... ఎంత డబ్బుకు అన్ని ఫీచర్లు అని చెప్పవచ్చు. మధ్య తరగతి కుటుంబ ప్రయాణ అవసరాలు తీర్చే మారుతి ఎర్టిగాకు, విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే, డబ్బు ఏ మాత్రం సమస్య కాదని ఎంచుకునే ఇన్నోవా క్రిస్టా వాహనానికి మధ్య చాలా తేడా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 9, 2018, 14:09 [IST]
English summary
Read In Telugu: Toyota Innova Crysta OUTSELLS the much cheaper Maruti Ertiga MPV
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+