టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

టయోటా యారిస్ సెడాన్‌కు ASEAN NCAP ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఐదు స్టార్ల రేటింగ్ సాధించి, సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది.

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ సరికొత్త యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును విపణిలోకి మే 18, 2018న విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. యారిస్ సెడాన్ వేరియంట్ల వారీగా ధరలు, ఇంజన్ ఆప్షన్లు మరియు ఫీచర్లతో సహా పూర్తి వివారాలు వెల్లడయ్యాయి. అయితే, ఇప్పుడు తాజాగా టయోటా యారిస్ సేఫ్టీ ఫలితాలు రివీల్ అయ్యాయి. ఇటీవల జరిపిన సేఫ్టీ టెస్టులో అద్భుతమైన ఫలితాలు సాధించింది.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

దీని భద్రత గురించి మాట్లాడితే, టయోటా యారిస్ సెడాన్‌కు ASEAN NCAP ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఐదు స్టార్ల రేటింగ్ సాధించి, సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

ఇండియన్ మార్కెట్లో యారిస్ పేరుతో విడుదల కాబోయే దీనిని థాయిలాండ్‌లో వియోస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఇండియన్ వెర్షన్ యారిస్‌ను పోలి ఉండే థాయిలాండ్ వెర్షన్‌కు ASEAN NCAP ఆధ్వర్యంలో సేఫ్టీ టెస్ట్ నిర్వహించారు.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

టయోటా యారిస్ సెడాన్ పెద్దలు మరియు పిల్లల పరంగా అద్భుతమైన భద్రతను కల్పిస్తున్నట్లు వెల్లడైంది. యారిస్‌కు నిర్వహించిన ఢీ పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా 36 పాయింట్లకు గాను 32.19 పాయింట్లు సాధించింది. ముందు మరియు ప్రక్క వైపున నిర్వహించిన ఢీ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరిచింది.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

యారిస్‌లో చిన్న పిల్లల భద్రత పరంగా 49 పాయింట్లకు గాను 42.44 పాయింట్లను సాధించింది. పిల్లల సేఫ్టీ విషయంలో ఫ్రంట్ మరియు సైడ్ క్రాష్ టెస్టులో ఫుల్ మార్కులు పడ్డాయి. సేఫ్టీ అసిస్ట్ పరంగా 18కి గాను 11 పాయింట్లు లభించాయి.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

ఇండియన్ వెర్షన్ టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డుగా లభిస్తున్నాయి.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

యారిస్ టాప్ ఎండ్ వేరియంట్లో హిల్-స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ అదే విధంగా ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. టయోటా యారిస్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో డీజల్ ఇంజన్ ఆప్షన్ రాలేదు.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

టయోటా తమ యారిస్ సెడాన్ వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలను అధికారికంగా ప్రకటించింది. యారిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.75 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.07 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

టయోటా యారిస్‌లో సాంకేతికంగా 1.5-లీటర్ డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. యారిస్ అన్ని వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

యారిస్ సెడాన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిని యాంటెన్నా, ఫాగ్ ల్యాంప్స్ మరియు ఇన్వర్టెడ్ ట్రెపిజాయిడల్ ఫ్రంట్ గ్రిల్ ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఎక్ట్సీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

టయోటా యారిస్ క్రాష్ టెస్ట్: సిటీ, సియాజ్ కంటే సురక్షితమైన కారు

ఇంటీరియర్ విషయానికి వస్తే, సిల్వర్ సొబగులు గల డ్యూయల్ టోన్ ట్రీట్‌మెంట్ క్యాబిన్ కలదు. ఇందులో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ డ్రైవర్ సీటు, రియర్ ఏ/సి వెంట్స్, ఆంబియంట్ లైటింగ్, సివిటి మోడల్‌లో పెడల్ షిఫ్టర్స్, 60:40 నిష్పత్తిలో మడిపే అవకాశం ఉన్న వెనుక వరుస సీట్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అన్ని వేరియంట్లలో ఏడు ఎయిర్ బ్యాగులతో లభించే టయోటా యారిస్ ఇండియన్ మార్కెట్లో లభించే అత్యంత సురక్షితమైన సెడాన్. పెద్దలు మరియు చిన్న పిల్లల భద్రత పరంగా సురక్షితమైన కారుగా నిరూపించుకుంది. తాజాగా యారిస్‌కు నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాల్లో అత్యద్భుతమైన ఫలితాలు కనబరిచింది.

దీంతో సేఫ్టీ పరంగా విపణిలో ఉన్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ వంటి మిడ్ సైజ్ సెడాన్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Crash Test: Scores 5-Star ASEAN NCAP Safety Rating.
Story first published: Thursday, May 17, 2018, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X