టయోటా యారిస్ విడుదల: ధర రూ.8.75 లక్షలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ విపణలోకి సరికొత్త టయోటా యారిస్ (Toyota yaris) కారును లాంచ్ చేసింది. టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ ప్రారంభ ధర రూ. 8.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ విపణలోకి సరికొత్త టయోటా యారిస్ (Toyota yaris) కారును లాంచ్ చేసింది. టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ ప్రారంభ ధర రూ. 8.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

టయోటా మోటార్స్ తమ యారిస్ సెడాన్ మీద ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించినపుడే వేరియంట్ల వారీగా ధరలు కూడా రివీల్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న టయోటా అధీకృత డీలర్ల వద్ద నేటి నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. తొలి రోజే 1,000 యూనిట్ల యారిస్ కార్లను డెలివరీ ఇవ్వనుంది.

టయోటా యారిస్ వేరియంట్లు మరియు ధరలు
టయోటా యారిస్ మిడ్ సెజ్ సెడాన్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, జె, జి, వి మరియు విఎక్స్. అన్ని వేరియంట్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తాయి. వేరియంట్ల వారీగా యారిస్ ఎక్స్-షోరూమ్(ఇండియా) ధరలు క్రింది పట్టికలో...
| Variant | MT | CVT |
| J | ₹ 8,75,000 | ₹ 9,95,000 |
| G | ₹ 10,56,000 | ₹ 11,76,000 |
| V | ₹ 11,70,000 | ₹ 12,90,000 |
| VX | ₹ 12,85,000 | ₹ 14,07,000 |

టయోటా యారిస్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్
టయోటా యారిస్‌లో సాంకేతికంగా 1.5-లీటర్ డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. యారిస్ అన్ని వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు.

టయోటా యారిస్ మైలేజ్
టయోటా యారిస్ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 17.1కిమీ/లీ మరియు యారిస్ పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ మైలేజ్ లీటరుకు 17.8కిలోమీటర్లుగా ఉంది.

టయోటా యారిస్ డిజైన్
టయోటా యారిస్ ఫ్రంట్ డిజైన్ మిగతా ఇతర సి-సెగ్మెంట్ సెడాన్ కార్లతో పోల్చుకుంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో బంపర్ మీద పెద్ద పరిమాణంలో ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న స్లీక్ హెడ్‌ల్యాంప్ డిజైన్, టయోటా లోగోకు ఇరువైపులా క్రోమ్ స్లాట్, బంపర్‌కు ఇరువైపులా కర్వీ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ ఉన్నాయి.

టయోటా యారిస్ సైడ్ ప్రొఫైల్‌లో 15-అంగుళాల 6-స్పోక్ అల్లాయ్ వీల్స్, క్యారెక్టర్ లైన్స్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్ ఉన్నాయి. యారిస్ సెడాన్ రియర్ డిజైన్‌లో సెమీ-ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, ఇరువైపులా రిఫ్లెక్టర్స్ ఉన్న బంపర్ ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

టయోటా యారిస్ సెడాన్‌ను ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, వైల్డ్‌ఫైర్ రెడ్, ఫాంటమ్ బ్రౌన్, గ్రే మెటాలిక్, సూపర్ వైట్, పర్ల్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్.

యారిస్ ఇంటీరియర్‌లో బ్లాక్ మరియు బీజి కలర్ కాంబినేషన్‌లో ఉన్న డ్యూయల్-టోన్ థీమ్ డ్యాష్‌బోర్డ్ ఉంది. ఈ డ్యాష్‌బోర్డ్ మీద అక్కడక్కడా సిల్వర్ సొబగులతో పాటు వాటర్ ఫాల్ డిజైన్‌లో ఉన్న సెంటల్ కన్సోల్ గమనించవచ్చు.

టయోటా యారిస్ ఇంటీరియర్‌లో గెస్చర్ కంట్రోల్ మరియు న్యావిగేషన్ సపోర్ట్ గల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల ఎమ్ఐడి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు సివిటి వేరియంట్లలో పెడల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

యారిస్‌లోని ఇతర ప్రధాన ఫీచర్లలో ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ డ్రైవర్ సీటు, రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఆంబియంట్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, కప్ హోల్డర్స్ గల రియర్ ఆర్మ్ రెస్ట్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు 60:40 నిష్పత్తిలో ముడుచుకునే రియర్ సీట్లు వంటివి ఉన్నాయి.

భద్రత పరంగా టయోటా యారిస్ సెడాన్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా లభిస్తున్నాయి.

యారిస్ టాప్ ఎండ్ వేరియంట్లో హిల్-స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ లాంకింగ్, రియర్ కెమెరా అదే విధంగా ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ విపణిలోకి మొట్టమొదటి సి-సెగ్మెంట్ సెడాన్ యారిస్ కారును ప్రవేశపెట్టింది. చిన్న కార్ల పరిశ్రమలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్న టయోటా ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లతో బాగా రాణిస్తోంది. ఇటీవల కాలంలో మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్‌కు ప్రజాదరణ ఎక్కువ అవుతుండటంతో యారిస్‌తో ఆరంగేట్రం చేసింది.

టయోటా యారిస్‌కు ఇటీవల క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఫలితాలు 5-స్టార్ రేటింగ్ పొంది, విపణిలో అత్యంత సురక్షితమైన మిడ్ సైజ్ సెడాన్‌గా గుర్తింపు పొందింది. 10 లక్షల లోపు ధరల శ్రేణిలో వచ్చిన టయోటా యారిస్‌లో ఎన్నో ఫస్ట్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. టయోటా యారిస్ మార్కెట్లో ఉన్న హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్ల నోర్లు మూయించనుంది.



Click it and Unblock the Notifications








