ఆటో ఎక్స్‌పోలో యారిస్ సెడాన్ కారును ఆవిష్కరిస్తున్న టయోటా
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద సరికొత్త యారిస్ సెడాన్ కారును ఆవిష్కరించనుం
Recommended Video

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద సరికొత్త యారిస్ సెడాన్ కారును ఆవిష్కరించనుంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, టయోటా మోటార్స్ యారిస్ కారును ప్రీమియమ్ సెడాన్ సెగ్మెంట్లో ఆవిష్కరించి, 2018 మలిసగంలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

టయోటా యారిస్ సెడాన్ ఇప్పటికే పలు ఆసియా మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. దేశీయ విపణిలోకి విడుదలయ్యే యారిస్ ఇంజన్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ సింగపూర్‌లో అమ్ముడయ్యే మోడల్‌నే పోలి ఉండనున్నట్లు తెలిసింది.

సింగపూర్ విపణిలో టయోటా ఈ యారిస్ సెడాన్ కారును వియోస్ మోనికర్ పేరుతో విక్రయిస్తోంది. యారిస్ మిడ్-సైజ్ సెడాన్ కారు పొడవు నాలుగు మీటర్లు పొడవున్న కార్ల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది.

యారిస్ ఫ్రంట్ ప్రొఫైల్‌లో స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇంజన్‌కు అధిక మొత్తంలో గాలిని గ్రహించేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్, ఫ్రంట్ బంపర్, ఎయిర్ ఇంటేకర్ పైభాగంలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

టయోటా యారిస్ సైడ్ ప్రొఫైల్‌లో టయోటా వారి ప్రీమియమ్ డిజైన్ పనితనం కనిపిస్తుంది. ఆకర్షణీయమైన షోల్డర్ లైన్స్, బి-పిల్లర్, విండో ఫ్రేమ్, టర్న్ ఇండికేటర్లు గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు వంటివి యారిస్ సెడాన్‌కు స్పోర్టిల్ లుక్ తీసుకొచ్చాయి.

రియర్ డిజైన్‌లో పదునైన యాంటెన్నా, చిన్న పరిమాణంలో పదునైన డిజైన్ కలిగిన టెయిల్ ల్యాంప్స్ మరియు బాడీలో ఇమిడిపోయే విధంగా చక్కగా డిజైన్ చేసిన రియర్ బంపర్ వంటివి గమనించవచ్చు.
Trending On DriveSpark Telugu:

యారిస్ సెడాన్ ఇంటీరియర్‌లో సింపుల్‌గా ఉన్న డ్యాష్ బోర్డ్ లేఔట్ ఉంది. ఇందులో, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సిల్వర్ సొబగులున్న స్టీరింగ్ వీల్, క్రోమ్ ప్లేటెడ్ డయల్స్ మరియు క్యాబిన్ మొత్తం డ్యూయల్ టోన్ కలర్ స్కీములో ఉంది. ఇండియన్ వెర్షన్ యారిస్ సెడాన్‌లో కూడా ఇదే ఇంటీరియర్‌ను పొందనుంది.

సాంకేతికంగా ఇండియన్ వెర్షన్ టయోటా యారిస్ సెడాన్ కారులో 107బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మరియు డీజల్ ఇంజన్ విషయానికి వస్తే, టయోటా లైనప్‌లో తక్కువ కెపాసిటి గల డీజల్ ఇంజన్ లేదు. కాబట్టి డీజల్ వెర్షన్ యారిస్‌ను 2020 నాటికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

టయోటా యారిస్‌లో ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‍తో పాటు, 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదనపు ఆప్షన్‌గా లభ్యం కానుంది. టయోటా 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో పరిచయం చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టయోటా మోటార్స్ భారత్ విపణిలోకి యారిస్ పరిచయంతో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటి మరియు మారుతి సుజుకి సియాజ్ కార్లు ఉన్నాయి. వీటిని ఎదుర్కొని టయోటా యారిస్ సక్సెస్ సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం అత్యంత పోటీతత్వమున్న ధరతో పరిచయం చేయడం.

టయోటా యారిస్ సెడాన్‌ను సుమారుగా రూ. 9 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. అతి త్వరలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2018లో యారిస్ సెడాన్ ఆవిష్కరణకు రానుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








