మార్కెట్లోకి విడుదలైన 2018 హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కారులో ప్రత్యేకతలేంటో తెలుసా...?
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విభాగం విపణిలోకి అప్‌డేటెడ్ వెర్షన్ ఐ20 యాక్టివ్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో పలు రకాల కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు నూతన ఫీచర్లు వచ్చాయి
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విభాగం విపణిలోకి అప్‌డేటెడ్ వెర్షన్ ఐ20 యాక్టివ్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో పలు రకాల కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు నూతన ఫీచర్లు వచ్చాయి.

హ్యుందాయ్ ఇటీవల యూరోపియన్ స్పెక్ ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. అయితే, ఇండియన్ స్పెక్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. డిజైన్ పరంగా మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది.

అప్డేటెడ్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ధరలలో కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ఐ20 యాక్టివ్ బేస్ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. సరికొత్త ఐ20 యాక్టివ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో స్వల్ప మార్పులు జరిగాయి.

హ్యందాయ్ ఐ20 యాక్టివ్ ఇది వరకు లభించే బ్రౌన్/బ్లాక్ మరియు వైట్/బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌తో పాటు అదనంగా మెరైన్ బ్లూ మరియు పోలార్ వైట్ పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. ఈ నూతన పెయింట్ స్కీమ్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.

వీటితో పాటు, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌లో సరికొత్త బూట్ లిడ్, వెనుక వైపున యాక్టివ్ లేబుల్ ఉన్నాయి. ఐ20 యాక్టివ్ ఓవరాల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఆఫ్ రోడర్ లుక్ కల్పించేందుకు బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.

అప్డేటెడ్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్యాబిన్ లోపల బాడీ కలర్ డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. సీట్లు, డ్యాష్‌బోర్డ్ మరియు అప్‌హోల్‌స్ట్రేలను సరికొత్త ప్యాట్రన్‌లో అందివ్వడం జరిగింది. ఐ20 యాక్టివ్ టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్‌లో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయి.

సరికొత్త హ్యందాయ్ ఐ20 యాక్టివ్‌లో సాంకేతికంగా అవే మునుపటి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. వీటిలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ మోడల్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ మోటార్స్ తమ ఐ20 యాక్టివ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో పలు ఫీచర్లను జోడించి మరియు నూతన కలర్ ఆప్షన్స్ పరిచయం చేసి, అప్‍డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ ఇటీవల యూరోపియన్ మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20 యాక్టివ్ కారును ఆవిష్కరించింది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2018 చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సరికొత్త 2018 అప్‌డేటెడ్ ఐ20 యాక్టివ్ మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫ్రీస్టైల్, టయోటా ఎటియోస్ క్రాస్ మరియు ఫియట్ అర్బన్ క్రాస్ వంటి మోడళ్లకు పోటీనిస్తుంది.



Click it and Unblock the Notifications








