రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో ప్రయాణికులంతా సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?
కేరళలో జరిగిన ఓ ప్రమాదంలో కారు ముందు మరియు వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయినా...అందులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.
Recommended Video

అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది... అదే గ్రహచారం బాగుంటే ఎంత ఘోరం నుంచైనా తాపీగా తప్పించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ నానుడి నిజమే అనిపించినప్పటికీ, అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు కేరళలో ఓ కారు రెండు లారీల మధ్య నలిగిపోయింది. అయితే, అందులో ఉన్న వారందరూ ఏ మాత్రం గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ఇక్కడ వీరంతా సురక్షితంగా తప్పించుకున్నారంటే ఆ క్రెడిట్ అదృష్టానిదో... లేదంటే గ్రహచారానిదో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే, ఆ కారు నిర్మాణ నాణ్యతే వారిని బయటపడేసింది. ఇంతకీ ఆ కారేదో చెప్పలేదు కదూ... ఈ ప్రమాదం ఎలా జరిగింది మరియు కారు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

కేరళలో జరిగిన ఓ ప్రమాదంలో కారు ముందు మరియు వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయినా...అందులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ వెంటో కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఇదే క్రమంలో వెంటో కారుకు వెనకాలే వచ్చిన మరో లారీ కారును వెనక నుండి ఢీకొట్టింది. దీంతో రెండింటి మధ్య తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. ఫోటోలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో కారులోని క్రంపల్ జోన్స్ ప్రమాదం జరిగినపుడు ఎలా పనిచేస్తాయో ఈ యాక్సిడెంట్ నిరూపించింది. క్రంపల్ జోన్స్ అంటే ముందు మరియు వెనుక వైపు నుండి ప్రమాదం జరిగినపుడు ప్రమాద తీవ్రత క్యాబిన్‌ను చేరకుండా ప్రమాదం నుండి వచ్చిన ఫోర్స్ చిన్న చిన్న మొత్తంలో విడిపోతుంది. ఈ పనితనం మొత్తం కారు ఫ్రేమ్‌లో ఇమిడి ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో కారుకు పోటీగా ఉన్న ఇతర మిడ్ సైజ్ సెడాన్ కార్లలో ఇదే బెస్ట్. అత్యుత్తమ బిల్ట్ క్వాలిటీ, బాడీ స్ట్రక్చర్ పెద్ద పెద్ద ప్రమాదాల నుండి ప్రయాణికులను సురక్షితంగా రక్షిస్తుంది. ఈ ప్రమాదంలో బాడీ స్ట్రక్చర్‌తో పాటు సీట్ బెల్ట్ మరియు ఎయిర్ బ్యాగులు కూడా చక్కటి పనితీరును కనబరిచాయి.

మంచి నిర్మాణ నాణ్యతలతో నిర్మించిన కార్లు ఎప్పుడైనా ప్రాణాలను కాపాడుతాయి. అలాంటి కార్లను నిర్మించే కంపెనీల్లో వోక్స్‌వ్యాగన్ ఒకటి. నిజమే, ఇండియాలో వోక్స్‌వ్యాగన్ ఆశించిన ఫలితాలు సాధించకపోయినా... ఆ కార్ల ధరలు ఎక్కువ అనిపించినా... సేఫ్టీ పరంగా సామాన్యుల బెస్ట్ కార్లు ఇవే అని చెప్పాలి.
Trending On DriveSpark Telugu:

ఇండియాలో చాలా వరకు కార్ల కంపెనీలు తేలికపాటి బరువున్న ఛాసిస్ మీద తక్కువ లోహంతో రూపొందించిన బాడీని నిర్మించి కార్లను తయారు చేస్తాయి. ఇందుకు ప్రధాన కారణం తక్కువ ధరలో మరియు అధిక మైలేజ్ ఇచ్చే విధంగా తయారు చేయాలనుకోవడం. ఇప్పట్లో కస్టమర్లు కూడా ఇలాంటి కార్లనే ఎంచుకుంటున్నారు.

డబ్బు మరియు మైలేజ్ మనిషి ప్రాణం కంటే విలువైనవేం కాదు. కాబట్టి కాస్తంత నాణ్యత ఉన్న కార్లను ఎంచుకోవడానికే ప్రయత్నించండి. మైలేజ్ బాగా వస్తాయని, తక్కువ ధరలోనే లభిస్తాయని నాణ్యత లేని కార్లను ఎంచుకోకండి.

వోక్స్‌వ్యాగన్, స్కోడా, ఫియట్ మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు బడ్జెట్ ధరలో అత్యుత్తమ నిర్మాణ నాణ్యత గల కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీ కార్లు భారీ ప్రమాదాల నుండి ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








