2017లో వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి చేసిన కార్ల సంఖ్య ఎంతో తెలుసా..?
జర్మన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ 2017లో కార్ల తయారీ పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు ప్రకటించింది.
జర్మన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ 2017లో కార్ల తయారీ పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా గత ఏడాది అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసినట్లు వోక్స్‌వ్యాగన్ పేర్కొంది.

గడిచిన 2017 సంవత్సరంలో వోక్స్‌వ్యాగన్ ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా..? ఏకంగా 60 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. గత కొన్ని సంవత్సరాల నుండి డీజల్ ఉద్గార కుంభకోణం కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకులను ప్రక్కనపెట్టి ఈ అరుదైన రికార్డును సాధించింది.
Recommended Video


వోక్స్‌వ్యాగన్ ఈ రికార్డ్ స్థాయి ప్రొడక్షన్ జరపడానికి ప్రధానంగా కారణమైన వాటిలో జెట్టా, గోల్ఫ్, పస్సాట్ మరియు పోలో కార్లు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా విడుదలైన టిగువాన్ ఎస్‌యూవీ, సరికొత్త పోలో, అర్టియాన్ మరియు టి-రాక్ వంటి మోడళ్లు కూడా ఈ రికార్డ్ సాధించడంలో కీలకపాత్ర పోషించాయి.

చైనా వంటి ఇతర మార్కెట్లలో శాంటానా వోక్స్‌వ్యాగన్‌కు మోస్ట్ పాపులర్ కారు. ప్రస్తుతం, వోక్స్‌వ్యాగన్ అంతర్జాతీయంగా 14 దేశాలలో 50 ప్రొడక్షన్ ప్లాంట్లలో 60 రకాల మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఒక్క 2017లోనే ప్రపంచ వ్యాప్తంగా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేసింది.

రానున్న సంవత్సరాల్లో వోక్స్‌వ్యాగన్ తమ లైనప్‌లోని అన్ని మోడళ్లను పునరుద్దరించనుంది. వాటి స్థానంలో ఎస్‌యూవీలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. వోక్స్‌వ్యాగన్ 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 19 కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయనుంది.
Trending On DriveSpark Telugu:

2020 నాటికి ఐడి, ఐడి క్రాస్ మరియు ఐడి బజ్ అనే ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఫ్యామిలీని సృష్టించాలని భావిస్తోంది. 2025 నాటికి రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ కార్లలో పది లక్షల కార్లు వోక్సవ్యాగన్‌కు చెందినవే ఉండాలని టార్గెట్ పెట్టుకుంది.

వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ ప్రొడక్షన్ మరియు లాజిస్టిక్స్ పర్యవేక్షణా అధ్యక్షుడు మరియు వోక్స్‌వ్యాగన్ బోర్డ్ నిర్వహణా సభ్యుడు థామస్ ఉల్‌బ్రిచ్ మాట్లాడుతూ, "వోక్స్‌వ్యాగన్ అంతర్జాతీయంగా కేవలం 12 నెలల్లోనే 60 లక్షలకు పైగా కార్లను తయారు చేసింది - ఇది తమ అన్ని ప్రొడక్షన్ ప్లాంట్ల మరియు ఉద్యోగుల నిరంతర శ్రమ ఫలితమని చెప్పుకొచ్చారు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోక్స్‌వ్యాగన్ గ్రూప్ డీజల్ ఉద్గార కుంభకోణంలో చిక్కుకుని గత రెండు మూడేళ్ల నుండి వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు, అనితర సాధ్యమైన రికార్డును వోక్స్‌వ్యాగన్ గ్రూప్ సాధించింది. 2017లో 60 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసి, తమకు అత్యుత్తమ భవిష్యత్తు ఉందని నిరూపించుకుంది. 2018లో మరిన్ని కొత్త ఉత్పత్తులతో పాటు 2020 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించడానికి వోక్స్‌వ్యాగన్ సిద్దమవుతోంది.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








