స్పోర్ట్ ఎడిషన్ పోలో, అమియో మరియు వెంటో కార్లను విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసింది. జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో ఉన్న మోస్ట్ పాపులర్ మోడళ్లయిన పోలో, అమియో మరియు వెంటో కార్లను స్పెషల్
వోక్స్‌వ్యాగన్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసింది. జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో ఉన్న మోస్ట్ పాపులర్ మోడళ్లయిన పోలో, అమియో మరియు వెంటో కార్లను స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది.
వోక్స్‌వ్యాగన్ స్పెషల్ ఎడిషన్ కార్లను స్పోర్ట్ ఎడిషన్ పేరుతో పలు కాస్మొటిక్ మెరుగులతో లాంచ్ చేసింది.

వోక్స్‌వ్యాగన్ పోలో, అమియో మరియు వెంటో స్పోర్టివ్ ఎడిషన్ కార్లలో స్టాండర్డ్ మోడళ్లతో పోల్చితే చాలా సుందరమైన అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. పోలో, అమియో మరియు వెంటో స్పోర్ట్ ఎడిషన్ కార్లలో గ్లోసీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, స్టైలిష్ సైడ్ ఫాయిల్స్, బ్లాక్ రియర్ స్పాయిలర్ మరియు కార్బన్ ఫినిషింగ్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ క్యాప్స్ వంటివి ఉన్నాయి.

ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ మినహాయిస్తే, వీటిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. డిజైన్ పరంగా చూడటానికి అచ్చం స్టాండర్డ్ మోడళ్లనే పోలి ఉంటాయి. ఈ మూడు స్పెషల్ ఎడిషన్ మోడళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.

అంతే కాకుండా వోక్స్‌వ్యాగన్ #BeASport అనే పేరుతో 360-డిగ్రీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా విలువైన కస్టమర్లకు ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. టెస్ట్ డ్రైవ్ అనంతరం కస్టమర్లు #BeASport ను ఉపయోగిస్తూ ఒక స్లోగన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఒక లక్కీ విజేతకు స్పెషల్ ఎడిషన్ వోక్స్‌వ్యాగన్ కారును బహుకరిస్తారు.

వోక్స్‌వ్యాగన్ తమ మోస్ట్ పాపులర్ కార్లను #BeASport క్యాంపెయిన్ పేరుతో స్పోర్టివ్ మరియు డ్రైవింగ్ స్పిరిట్‌తో కూడా ఎక్ట్సీరియర్ కాస్మొటిక్ అప్‌డేట్స్ నిర్వహించింది. అద్భుతమైన మరియు పర్ఫామెన్స్ కనబరిచే వీటిని డ్రైవ్ చేయడం సాధారణ కార్లకంటే ఎంతో ఫన్ మరియు స్పోర్టివ్ ఫీలింగ్‌నిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవల పోలో మరియు అమియో పేస్ ఎడిషన్ మోడళ్లను 1-లీటర్ స్మాల్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 75బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోక్స్‌వ్యాగన్ కార్లను ఇష్టపడే విలువైన కస్టమర్లను చేరుకునేందుకు పోలో, అమియో మరియు వెంటో మోడళ్లను పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో స్పోర్ట్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. రెగ్యులర్ మోడళ్ల కంటే ఇవి చూడటానికి ఎంతో స్పోర్టివ్‌గా ఉంటాయి.


Click it and Unblock the Notifications








