వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ విడుదల: ధర, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
వోల్వో ఇండియా విపణిలోకి సరికొత్త ఎక్స్‌సి40 ఎస్‌యూవీని (XC40 SUV) లాంచ్ చేసింది. వోల్వో ఇండియా లైనప్‌లో లభించే అత్యంత సరసమైన ధరలో లభించే మరియు అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌సి40.
వోల్వో ఇండియా విపణిలోకి సరికొత్త ఎక్స్‌సి40 ఎస్‌యూవీని (XC40 SUV) లాంచ్ చేసింది. వోల్వో ఇండియా లైనప్‌లో లభించే అత్యంత సరసమైన ధరలో లభించే మరియు అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌సి40.
అత్యంత సరసమైన వోల్వో ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి లాంచ్ స్టోరీలో...

అతి తక్కువ ధరలో లభించే వోల్వో ఎక్స్‌సి40 ఆర్-డిజైన్ అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. దీని పరిచయాత్మక ధర రూ. 39.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ మీద 5 లక్షల రుపాయల టోకన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన అతి చిన్న ఎస్‌యూవీ కంపెనీ సిగ్నేచర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సరికొత్త స్మాల్ ఎస్‌యూవీ ఇండియాలో మంచి సేల్స్ సాధించి పెడుతుందని వోల్వో ధృడ నమ్మకంతో ఉంది.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఉంది. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో విభిన్న బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, స్మోక్ ఎఫెక్ట్ గల అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, థార్స్ హ్యామర్ ఎల్ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆర్-డిజైన్ వేరియంట్లో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో బ్లాకెండ్ రూఫ్ మరియు ఏ-పిల్లర్లు స్టాండర్డ్‌గా వచ్చాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, బ్లాక్ అప్‌హోల్‌స్ట్రే మరియు లావా కార్పెటింగ్ మరియు డోర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ గల స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వర్చువల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్యానరోమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ఈ స్మాల్ ఎస్‌యూవీలో లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, పైలట్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ స్వీడిష్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత సరసమైన ఎస్‌యూవీ. వోల్వో ఎక్స్‌సి40 విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎ మరియు ఆడి క్యూ3 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

ఎక్స్‌సి40 విడుదలతో వోల్వో ఇండియా అత్యధిక సేల్స్ ఆశిస్తోంది. ఒక రకంగా వోల్వో ప్లాన్ ఫలించే అవకాశం ఉంది. తక్కువ ధరలోనే లభించే దీనితో తమ స్టేటస్ ప్రతిబింబిస్తుంది కాబట్టి వోల్వో ఎక్స్‌సి40 భారీ విజయాన్ని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








