వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

వోల్వో ఇండియా విపణిలోకి నేడు సరికొత్త ఎక్స్‌సి90 లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో లాంచ్ చేసింది.

By Anil Kumar

వోల్వో ఇండియా విపణిలోకి నేడు సరికొత్త ఎక్స్‌సి90 లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో లాంచ్ చేసింది. ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీల సెగ్మెంట్లోకి వోల్వో ఎక్స్‌సి90 టి8 ఇన్‌స్క్రిప్షన్ (Volvo XC90 T8 'Inscription) మోడల్‌ను ప్రవేశపెట్టింది. సరికొత్త వోల్వో ఎక్స్‌సి90 టి8 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్ ధర రూ. 96.65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

వోల్వో తమ ఎక్స్‌సి90 టి8 మోడల్‌ను ఇది వరకే ఎక్సలెన్స్ అనే వేరియంట్లో విడుదల చేసింది. ఎక్స్‌సి90 టి8 ఎక్సలెన్స్ వేరియంట్ ధర రూ. 1.31 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 4-సీటర్ ఎక్సలెన్స్ వేరియంట్ వోల్వో ఇండియా యొక్త మొట్టమొదటి హైబ్రిడ్ మోడల్.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్ విడుదలతో కంపెనీ ఇప్పుడు తాజాగా 7-సీటర్ మోడల్‌ను ఈ జాబితాలోకి చేర్చింది. సరికొత్త వోల్వో ఎక్స్‌సి టి8 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్లో అదే హైబ్రిడ్ పవర్ ఇంజన్‌ను యథావిధిగా కొనసాగించింది.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

వోల్వో ఎక్స్‌సి టి9 ఇన్‌‌స్క్రిప్షన్ అదే 2.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ మరియు సూపర్‌ఛార్జ్‌డ్ ఇంజన్ ఆప్షన్‌లు, అదనంగా ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి. పెట్రోల్ ఇంజన్ 320బిహెచ్‌పి మరియు ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల పెట్రోల హైబ్రిడ్ ఇంజన్ యూనిట్ సంయుక్తంగా 407బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యుస్ చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

వోల్వో ఎక్స్‌సి90 టి8 లగ్జరీ ఎస్‌యూవీలో నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది, ముందు చక్రాలకు పెట్రోల్ ఇంజన్ నుండి మరియు వెనుక చక్రాలకు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి పవర్ సరఫరా అవుతుంది. ఈ ఎస్‌యూవీ కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మీద మాత్రమే కూడా నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 40కిమీలు ప్రయాణిస్తుంది మరియు బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ కోసం 150నిమిషాలు పడుతుంది.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90 టి8 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్ సాధారణ డీజల్ వేరియంట్‌నే పోలి ఉంది. ఇందులో ప్యానోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్లకు మెసేజ్ ఫంక్షనాలిటీ, వోల్వో సిగ్నేచర్ ఫుల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

వోల్వో ఎక్స్‌సి90 టి8 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్లో సేఫ్టీ పరంగా లేన్ కీప్ అసిస్ట్, కొల్లిషన్ అవాయిడ్ బ్రేకింగ్ సిస్టమ్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్ మరియు రాడార్ ఆధారిత అడాప్టివ్ క్రూయిజ్ కంట్రల్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భవిష్యత్తులో డీజల్ ఇంజన్‌ల ఉత్పత్తిని నిలిపేస్తామని వోల్వో గతంలో ప్రకటించింది. దాని కంటే ముందుగా, 2025 నాటికి తమ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ సేల్స్ 50 శాతానికి పెంచుకోవాలిని భావిస్తోంది.

వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ విడుదల: ధర మరియు వేరియంట్లు

తాజాగ విడుదలైన వోల్వో ఎక్స్‌సి90 టి8 విపణిలో ఉన్న మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మరియు రేంజ్ రోవర్ వెలార్ వంటి మోడళ్లకు పోటీనిస్తుంది. అయితే, ఈ సెగ్మెంట్లో హైబ్రిడ్ టెక్నాలజీ గల ఏకైక ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి90.

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2018, 18:21 [IST]
English summary
Read In Telugu: Volvo XC90 T8 Inscription Petrol Hybrid Launched In India; Priced At Rs 96.65 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+