టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు: ఎందుకో తెలుసా?

Written By:
Recommended Video - Watch Now!
India Car Stunts Caught On Camera

రోడ్డు, రైలు, జల మార్గాలకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. అయితే, గాల్లో ఎగిరే విమానానికి అడ్డంకులు ఏముంటాయిలే అనుకుంటారు. కానీ, విమానాలు కూడా ప్రయాణించలేని భూ భాగం ఒకటి ఉంటుంది.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

దక్షిణాసియాలోని, భారత్ మరియు చైనా మధ్య గల హిమాలయ పర్వతాల్లోని సువిశాల టిబెట్ పీఠభూమి మీదుగా ఇప్పటికీ విమానాలు వెళ్లలేకపోతున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ తరువాత విమానాలు వెళ్లలేని ప్రదేశం బహుశా ఇదేనేమో.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

మీరు చదివింది అక్షరాలా నిజమే. టిబెట్ భూభాగం మీదుగా ప్రపంచ వ్యాప్తంగా ఏ విమానయాన సంస్థ కూడా తమ విమానాలు ప్రయాణించడానికి అనుమతించవు. ప్రపంచ ఏవియేషన్ నియమ నిభందనల ప్రకారం, ఏ విమానం కూడా ఈ ప్రాంతం మీదుగా వెళ్లకూడదు.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

టిబెట్ మీదుగా విమానాలు వెళ్లలేకపోవడానికి ఎలాంటి వింతలు లేవు. ఎత్తైన పర్వతాలు ఉండటమే ఇందుకు గల ప్రధాన కారణం. టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. సముద్రం మట్టం నుండి ఇది 16,000 అడుగుల ఎత్తులో ఉంది.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

భూమి మీద విమానాలు ప్రయాణించడానికి సాధ్యం కానీ ఈ ప్రదేశాన్ని "రూఫ్ ఆఫ్ ది వరల్డ్" అని కూడా అంటారు. విమానాలు వెళ్లే గరిష్ట ఎత్తు కంటే ఇంకా ఎక్కువ ఎత్తులో ఉండటమే ఇందుకు ఒక కారణం.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

టిబెట్ భూభాగం మీదుగా విమానాలు ఎందుకు వెళ్లలేవు - అనే అంశం గురించి ప్రముఖ ఆన్‌లైన్ ప్రశ్నోత్తరాల వేదిక కోరాలో పెద్ద వాదనే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ఏవియేషన్ నిపుణులు తమ అభిప్రాయలను వెల్లడించారు.... ఈ ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్‌గా మారడానికి గల కారణాలేంటో చూద్దాం రండి...

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

ఎయిర్‌లైన్ ఉద్యోగి టిమ్ హిబ్బెట్స్ మాట్లాడుతూ, "12,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అంతకు మించి ఎత్తుకు ప్రయాణిస్తే విమానంలోని ప్రయాణికులకు ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది."

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

విమానం అనవసరపు ఎత్తును చేరినపుడు ఆ ప్రదేశంలో ప్రాణవాయువు లభ్యత లేకపోతే విమానంలోని ప్రయాణికులకు 20 నిమిషాల వరకు మాత్రమే ఆక్సిజన్ అందించవచ్చు. కాబట్టి, ఎక్కువ ఎత్తుకు విమానాలు వెళ్లడానికి సంభందిత ఎయిర్‌సైన్స్ అనుమతించవు.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

విమానయాన నియమాల ప్రకారం, ఎక్కువ ఎత్తులో ఉన్న విమానాల్లో ఆక్సిజన్ అందకపోతే ఒక్కసారి పది వేల అడుగుల ఎత్తులోకి విమానాన్ని దింపేయవచ్చు. కాబట్టి, ఆసియాలోని ఈ ప్రాంతంలో ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తే ఆక్సిజన్ కొరత ఉంటుంది. అందుకే టిబెట్ మీదుగా విమానాలు వెళ్లలేవు." అని హిబ్బెట్స్ తెలిపాడు.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

అయితే, కేవలం క్యాథ్యా పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానాలు టిబెట్ మార్గం గుండా వెళ్లగలవు అని తెలిసింది.

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

ఎయిర్‌లైన్స్ విద్యనభ్యసించిన బాలాజీ విశ్వనాథన్ మాట్లాడుతూ, "నిజానికి, ఇండియా చైనా మధ్య ఎలాంటి సంత్సంభందాలు లేవు. కాబట్టి, ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలు కూడా లేవు. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య విమానాలు నడిచి ఉంటే, ఖచ్చితంగా టిబెట్ మీదుగానే విమానాలు వెళ్లేవని తెలిపాడు."

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

చరిత్రలో ఎన్నడూ కలవని రెండు దేశాలు ఇక ముందు కూడా కూడా కలిసే అవకాశాలు లేవు. కాబట్టి, ఈ రెండు దేశాలకు మధ్యలో ఉన్న టిబెట్ మీదుగా విమానాలు ప్రయాణించే అవకాశాలు కూడా లేవని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు."

టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు

విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Why Airliners Dont Fly Over Tibet

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark