బ్రహ్మాండమైన ఫీచర్లతో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దగ్గజం బిఎమ్‌డబ్ల్యూ నేడు ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్(X3 xDrive 20d M Sport) ఎస్‌యూవీని నిశ్శబ్ధంగా లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 54 లక్షలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

ఇండియన్ మార్కెట్లోని ఎక్స్3 లైనప్‌లో ఎమ్‌ స్పోర్ట్ టాప్ ఎండ్ వేరియంట్ మరియు అదనపు ఫీచర్లు గల ఎమ్ స్పోర్ట్ వేరియంట్‌ను ప్రస్తుతం ఉన్న ఎక్స్‌లైన్(xLine) వేరియంట్ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రవేశపెట్టింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీలో అదే 190బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజల్ ఇంజన్ వచ్చింది. అయితే, ఎక్స్‌లైన్ వేరియంట్లో లభించే 2.0-లీటర్ 28ఐ పెట్రోల్ ఇంజన్‌ను లైనప్‌ నుండి తొలగించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

సరికొత్త ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో, ప్రత్యేకంగా ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో కొన్ని చోట్ల ఎమ్ బ్యాడ్జింగ్, ఏరోడైనమిక్ ప్యాకేజ్, ఎమ్ స్పోర్ట్ లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ కోసం స్పోర్టివ్ సీట్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

ఎక్స్3 ఎక్స్‌పెడిషన్ వేరియంట్లో ఉన్న 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పోల్చుకుంటే ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో పెద్ద పరిమాణంలో ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, 8.8-అంగుళాల పరిమాణంలో ఉన్న ఐడ్రైవ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

Trending On DriveSpark Telugu:

పలు కొత్త మోడళ్లతో ఒకేసారి రెండు దిగ్గజాలకు షాకిస్తున్న టాటా

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో అందరూ సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?

24,000 బైకులను రీకాల్ చేసిన యమహా ఇండియా

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

205-వ్యాట్ సామర్థ్యం గల తొమ్మిది స్పీకర్లు మ్యూజిక్ సిస్టమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనుసంధానంతో వచ్చింది. అదనంగా రెండు 12వోల్ట్స్ పవర్ సాకెట్స్, స్టోరేజ్ స్పేసెస్, రెండు కప్ హోల్డర్లు ఉన్న రియర్ ఆర్మ్ రెస్ట్, సీట్ బ్యాక్ ట్రేస్ వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ వేరియంట్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది అవి, మెల్‌బోర్న్ రెడ్, స్పేస్ గ్రే,

కార్బన్ బ్లాక్ మరియు ఆల్పైన్ వైట్. అయితే, బేస్ వేరియంట్ ఎక్స్‌పెడిషన్ ఎక్స్‌క్లూజివ్ బ్లూ కలర్‌లో కూడా లభిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 లగ్జరీ ఎస్‌యూవీల శ్రేణి రూ. 49.10 లక్షల ధరతో ప్రారంభమవుతుంది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ గరిష్ట ధర రూ. 54 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎమ్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 లైనప్‌లో కొన్ని వేరియంట్లను స్వల్ప అప్‌డేట్స్‌తో విడుదల చేస్తూనే, మరికొన్ని వేరియంట్లను శాశ్వతంగా లైనప్‌ నుండి దూరం చేస్తోంది. మే 2018లో థర్డ్ జనరేషన్ ఎక్స్3 విడుదల ఉన్న నేపథ్యంలోనే సెకండ్ జనరేషన్ ఎక్స్3 లోని కొన్ని వేరియంట్లను తొలగిస్తున్నట్లు తెలిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ తమ మూడవ తరానికి చెందిన ఎక్స్3 లగ్జరీ ఎస్‌యూవీని ఈ ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: BMW x3 xdrive 20d m sport launched in india. price, specifications, features and images.
Story first published: Wednesday, January 10, 2018, 14:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark