కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఎన్నో ఆంక్షలు విధించింది. వాటిలో ముఖ్యంగా బిఎస్-6 ఇంజిన్ కలిగిన వాహనాలు 2020 కల్లా మరియు ఎలక్ట్రిక్ వాహనాలు 2022 కల్లా ఉండలని సూచించింది. దీనికి తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలను తీసుకొంటున్నాయి. అయితే తాజాగా ఏపి ప్రభుత్వం ముందు కూడా ఒక సవాలు ఉంది అదేమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి 15 ఏళ్ల వాణిజ్య డీజిల్ వాహనాల వాడకాన్ని నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

భారతదేశంలోని టాప్ కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం ఉంది, దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఇటీవల ప్రకటించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనల ప్రకారం, పిఎమ్10 యొక్క పరిసర ప్రాంతాలలో గాలి యొక్క నాణ్యత నగర తాజా సగటు గణాంకాల ప్రకారం 60 యొక్క జాతీయ విలువ కాగా, అయితే కొన్ని నగరాలలో దీనికి వ్యతిరేకంగా 76గా ఉంది.

ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు 80 కంటే పిఎమ్10 వార్షిక విలువను కలిగి ఉన్నాయి. ఇక్కడ పిఎమ్10 అంటే పర్టికులర్ మేటర్, దీనిని వాతావరణ కాలుష్య వివరణలతో ఉపయోగిస్తారు.

పిఎమ్10 స్థాయి 76 దాటకుండా ధృవీకరించడానికి, APPCB ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది మరియు RTA సహా మొత్తం ఏడు విభాగాలకు పంపిణీ చేసింది. డిసెంబర్, 2019 కంటే ముందే ఈ నిబంధనను అమలు చేయాలని కూడా బోర్డు సూచించింది.

ఈ ప్లాన్ లో, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాత కమర్షియల్ డీజిల్ వాహనాలను నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి, ఏపి ప్రభుత్వాన్ని కోరింది అని సమాచారం.

ట్రక్కులు, ప్యాసింజర్ బస్సుల వంటి పెద్ద రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి పునరుద్ధరిం చాలని సీనియర్ ట్రాన్స్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. కానీ ప్రైవేటు వాహనాల విషయానికి వస్తే రెన్యువల్ కాలం 15 సంవత్సరాలు ఉంటుందని తెలియచేసారు.

"అయితే నగరాలలో కనీసం 5% కార్లు మరియు 5% మోటార్ సైకిళ్ళ 15 సంవత్సరాల పాతవి ఉన్నాయని, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాతబడి ఉన్న పెద్ద వాహనాలు నగరంలో ఇంకా తిరుగుతున్నాయని వీటిని నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి కోరింది.

కానీ వీటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. కాలుష్య నియంత్రణ మండలి సూచనపై ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది " అని రవాణాశాఖ అధికారి తెలిపారు.
Source:Indiatimes


Click it and Unblock the Notifications








