భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?
భారతదేశంలో ఎక్కువగా పేడను ఉపయోగించి ఎన్నో చేస్తుంటారని మనకు తెలుసు,ఇంకా పేడ హిందూ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది,కానీ ఇప్పుడు చెప్పబోయే విచిత్రమైన సంఘటన ఎప్పుడూ విని వుండరు,వివరాలలోకి వెళితే.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి.వచ్చే జూన్, జూలై నెలల్లో ఇది ఎలా ఉంటుందో మనకు తెలుసు. AC లేకుండా కారులో ప్రయాణిస్తున్నప్పుడు తీవ్రమైన వేడి కారణంగా ఎంతో ఇబ్బందికి గురి అవుతాము.

అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను చేరుకొన్నాయి,ఈ నగరంలో AC లేకుండా కారును డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించగలం.కానీ ఈ నగరానికి చెందిన ఒక వ్యక్తి,తన కారును చల్లగా ఉంచడానికి ఒక వినూత్న మార్గంతో ముందుకు వచ్చారు.

దానిని ఆన్లైన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు,అది ఆవు పేడతో నిండిన ఒక కారును మీరు చూడవచ్చు.ఆశ్చర్యపోయారా? ఆన్లైన్లో ఈ విషయాన్నీ పంచుకున్న వ్యక్తి 'రూపేష్ గౌరంగా దాస్'.

ఈ వ్యక్తి, తన కారును చల్లగా ఉంచడానికి ఒక పరిష్కారంని కనుగొన్నాడు,అది తన పాత మోడల్ టయోటా కార్కు ఆవు పేడను పూసాడు,ఆ చిత్రాలను మీరు ఇక్కడ చూస్తున్నారు,కానీ దూరం నుంచి ఆ కారును చూసేటప్పుడు అది ఒక రబ్బర్తో కోటింగ్ చేసినట్టు కనబడుతుంది.

అయితే యజమాని ఈ కార్ పై పేడ వాసన రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఈ పద్ధతి యొక్క ప్రభావం ఆశ్చర్యానికి గురిచేసిందని, "నేను ఇప్పటివరకు చూసిన ఆవు పేడల యొక్క ఉత్తమ ఉపయోగం ఇదే" అని అతను చెప్పాడు.

ఈ కారణాల వల్ల,గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు తమ గృహాలను చల్లగా ఉంచుకోవడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ జపనీస్ కారు పై ఈ విధంగా చేయడం ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు అని చెప్పవచ్చును.

టయోటా కరోల్ల తెల్ల పెయింట్ కార్ అని తెలిసింది,ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రంగు గల కార్ అని చెప్పవచ్చు,అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమ్ముడవుతున్న కారులలో ఇది ఒకటి,ఇది బాంబు ప్రూఫ్ కారుగా కూడా ప్రసిద్ధి చెందింది.

ఈ కారుకు వెనుక బంపర్ రిఫ్లెక్టర్లు, టయోటా బ్యాడ్జ్ మరియు లోగో, నంబర్ ప్లేట్లు మరియు పార్కింగ్ రంధ్రాలు తప్ప మిగిలిన ప్రదేశాలలో పేడను పూసారు.

ఏది ఏమయినప్పటికీ రెండు విషయములు మనము ఆలోచించవలసి ఉంటుంది.ఒకటి, ఎవరైనా అనుకోకుండా కారుని తాకితే వారికీ ఆవు పేడ అంటుకొంటుంది,దీని కోసం చాలా జాగ్రత్త తీసుకోవాలి.రెండవది, ఈ సహజ శీతలీకరణ పొరను తీసివేయవలసి వస్తే కార్ పై పెయింట్ దెబ్బతిన వచ్చు దీనికి కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి.

ఉష్ణోగ్రతలు రాబోయే రోజులలో అధికం అవుతాయి,మీ కారు యొక్క వేడిని ఎదురుకోవడానికి తగిన పరిష్కారాలను వెతుకుతున్న వారు అయితే,మీ కారు ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే,తగిన మార్గాలు గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయడం.
Source:Rupesh Gauranga Das


Click it and Unblock the Notifications








