19 లక్షల నిస్సాన్ కారును కేవలం రూ.2 లక్షలకే కొట్టేసిన ఘనుడు.....!
కేవలం 2 లక్షల రూపాయలకే నిస్సాన్ కిక్స్ కొన్నాడు, అలా అనుకొంటే మీరు పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే ఒక అతను డౌన్ పేమెంట్ చెల్లించి పూజ చేయిస్తానని చెప్పి మరీ యజమానిని నమ్మించి కార్ తీసుకుపోయాడు.

బెంగళూరులో నిస్సాన్ షోరూమ్ లో జరిగిన యధార్థ సంఘటన, రూ.18.6 లక్షల విలువ గల కారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఇచ్చి తీసుకుపోయాడు ఒక ప్రబుద్దుడు, వివరాలలోకి వెళితే..

జోస్ థామస్ అకా జోసెఫ్ అనే కస్టమర్ నిస్సాన్ కిక్స్ వాహనం కోసం షో రూంకి వెళ్ళాడు, అక్కడ నిస్సాన్ కిక్స్ కార్ వివరాలను తెలుసుకొన్నాడు,

ఆ కార్ ధర రూ 18.6 లక్షలు అని చెప్పగానే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టిన తరువాత పూజ చేయించుకుంటానని చెప్పి కారును తీసుకెళ్లాడు.ఇక అంతే అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు.

ఎన్ని సార్లు ఫోన్లు చేసినా సమాధానం లేదు.నిందితుని ఆఫీసుకు వెళ్లి అరా తీసిన ఫలితం దక్కలేదు,చివరికి పోలీసులను ఆశ్రయించిన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఘటన జరిగి నాలుగు నెలలైంది.

ఈ సంఘటన జనవరి 23న బెంగళూరు నగరంలోని దొడ్డనెకుంది వద్ద ఉన్న సూర్య నిస్సాన్ షోంరూంలో జరిగింది. అయినప్పటికీ, షోరూమ్ మేనేజర్ HAL పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు ఫిర్యాదు చేశారు,

దాదాపు నాలుగు నెలల తరువాత(మే 21న) షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు గురువారం మహాదేవురాపు పోలీసు స్టేషన్కు బదిలీ అయింది.

మేనేజర్ గణేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ, జనవరి 23 న ఉదయం 6:30 గంటలకు నిస్సాన్ కిక్స్ వాహనం గురించి అడిగిన షోరూమ్ కి జోస్ థామస్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారని తెలిపాడు, తరువాత ఇలా జరిగింది అని చెప్పాడు.

ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగితే దానిపై గణేష్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. గణేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునిన తరువాత డిసిపి అబ్దుల్ అహద్ దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేసినందున కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని,నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ వివరాలను సేకరించామని డిసిపి తెలిపారు.
Source: Thenewsminute


Click it and Unblock the Notifications








