బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కూపే ను ప్రపంచవ్యాప్తంగా గత నెలలో ఆవిష్కరించారు. అయితే, భారత గడ్డపై ఈ కారుకు రహస్యంగా పరీక్ష జరగడం ఇదే మొదటి సారి కావడంతో త్వరలో దేశీయ మార్కెట్ లో కూపే విడుదల చేసే సంకేతాలు కనపడుతున్నాయి. మరి ఈ లగ్జరీ కారు యొక్క వివరాలను వివరంగా తెలుసుకొందాం రండి..

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

6 సిరీస్ కూపేకు దగ్గర పోలికలు ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కూపే, మోటార్ బీమ్ ద్వారా గుర్గావ్ లో రహస్యంగా పరీక్షిస్తుండగా కెమెరా కళ్ళకు చిక్కింది. కారు భారీగా కనపడుతోంది, ఇప్పటికీ, అన్ని రకాలైన డిజైన్ కలిగిన కూపే యొక్క స్టైలింగ్ ఈ కింది చిత్రాలలో చూడవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

బిఎమ్‌డబ్ల్యూ ఒక అధికారిక టీజర్ ను కూడా ప్రారంభించింది, ఈ 8 సిరీస్ జూన్ చివరిలో మ్యూనిచ్ లో అరంగేట్రం చేసినదని తేలింది. అయితే, భారత మార్కెట్లో విడుదల చేయడం అనేది ఇంకా ఎటువంటి సమాచారం లేదు, కానీ అంతర్జాతీయ మార్కెట్ తో ఇది దగ్గరలో విడుదల కావచ్చు అని చెప్పవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

ఇక బిఎమ్‌డబ్ల్యూ 8-సిరీస్ స్టైలింగ్ విషయానికి వస్తే ఈ చిత్రాల నుండి, కూపే కిందివైపు వంపు లో పొడిగించబడిందిగా ఇది కనిపిస్తుంది, ఇది ఇప్పుడు మరింత చాల పొడవైన రూపాన్ని కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

తరువాత ఏటవాలుగా ఉండే పైకప్పు వలన వెనక వైపున పొడవైన ప్రయాణీకులకు కూర్చోవడానికి చాల అనువుగా ఉండవచ్చు. సైజ్ వారీగా చూస్తే 8-సిరీస్ కూపే పొడవు 5082 మి.మీ., వెడల్పు 1932 మి.మీ, ఎత్తు 1407 మి.మీ. కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఈ 8 సిరీస్ పెట్రోల్ మరియు డీజల్ రెండింటిలో అందుబాటులో ఉంటుంది. 840ఐ అనేది టర్బోఛార్జ్ 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, పెట్రోల్ యూనిట్ గా ఉంటుంది. ఇది 340 బిహెచ్పి మరియు 500 ఎన్ఎమ్ యొక్క గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

బిఎమ్‌డబ్ల్యూ 8-సిరీస్ 0-100 కిమీ/గం సమయాలు వరుసగా 5.2 సెకన్లు మరియు 4.9 సెకన్లు వేగాన్ని అందుకోగలదు. మరోవైపు, డీజిల్ 840డి 3.0-లీటర్, ఇన్ లైన్-సిక్స్ ఇంజిన్ ద్వారా 320 బిహెచ్పి మరియు 680 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

దీనిపై 0-100 కిమీ/గం కేవలం 5.1 సెకన్లలో వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఉంది. అన్నింటిని మించి, ఎమ్850ఐ ఎక్స్ డ్రైవ్ పై, 4.4-లీటర్, టర్బో ఛార్జ్ డ్ వి8 ఇంజిన్ ను కలిగి ఉంటుంది, ఇది 530బిహెచ్పి పవర్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 3.9 సెకండ్లలో 100కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

బిఎమ్‌డబ్ల్యూ నుండి రానున్న కొత్త 8 సిరీస్ లగ్జరీ కారు ఇదే

అన్ని ఇంజిన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి, 840ఐ మరియు ఎమ్850ఐ ఎక్స్ డ్రైవ్ రెండూ కూడా ఎమ్ స్పోర్ట్ రేర్ డిఫరెన్షియల్ ను కలిగి ఉన్నాయి. రియర్-వీల్ స్టీరింగ్ అనేది ఫోర్ వీల్ డ్రైవ్ కార్లపై స్టాండర్డ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ మోడల్స్ పై ఆప్షనల్ గా ఉంటుంది.

Source: Motorbeam

Most Read Articles

English summary
BMW 8 Series Spied Testing In Indian For The First Time — Looks Bigger That Its Sibling
Story first published: Thursday, August 1, 2019, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X