Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం చేసిన పాత నోట్ల రద్దు అలాగే జిఎస్టి వంటి నిర్ణయాలతో ప్రజలపై ఎంతటి భారం పడిందో అందరికి తెలుసు. ఈ నిర్ణయంతో ప్రజలు పడిన కష్టాలు అంత ఇంతా కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో బాంబ్ పేల్చనుంది అది ఏమిటో వివరంగా తెలుసుకోండి..

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఆధారిత రెండు, నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని భారత ప్రభుత్వం చూస్తోంది. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కు సంబంధించిన చార్జీలను త్వరలో 25 రెట్ల వరకు పెంచనున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఒకసారి కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు అమలు చేస్తే, పెట్రోల్ లేదా డీజిల్ కారు నమోదు చేస్తే వారికీ రూ.5000, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసే వారికీ రూ.10,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు చార్జీలు ఒక్కొక్కటి కేవలం రూ.600 మాత్రమే ఉన్నాయి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంధ్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. దీని వలన పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత వాహనాల కొనుగోలును తగ్గించవచ్చని కేంద్రం యొక్క ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపునకు సవరణ బిల్లు ప్రస్తుతం ఇంకా ఆమోదించే దశలోనే ఉంది, ఇది కొంత కాలం తరువాత అమలు కానుంది. మరి కేంద్రం ఈ సవరణా బిల్లు ను ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు
ఈ ప్రతిపాదన ప్రకారం ప్రైవేటు కార్లు, క్యాబ్ లు, అన్ని ద్విచక్ర వాహనాలతో పాటు వివిధ రకాల ఇంధనంపై నడుస్తున్న అన్ని ద్విచక్రవాహనాలు తమ రిజిస్ట్రేషన్ చార్జీల్లో పెరుగుదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదన ప్రకారం ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ను రూ.1000 కు పెంచాల్సి ఉండగా దానిని తిరిగి రూ.2000 వరకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.50 వద్ద ఉన్నాయి.

అదేవిధంగా ప్రస్తుతం రూ.1000 ఉన్న క్యాబ్ ల రిజిస్ట్రేషన్ ను రూ. 10,000 కు, రీ-రిజిస్ట్రేషన్ కు రూ.20,000 చొప్పున పెంచనున్నారు. అంటే అన్నీ కూడా, ఇంపోర్టెడ్ వాహనాలు సైతం ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.40,000 వరకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరుగుదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కమర్షియల్ ఎల్ఎంవిలు రిజిస్ట్రేషన్లకు రూ.1000 నుంచి రూ.10,000 వరకు మరియు రెన్యువల్ కొరకు రూ.20,000 వరకు పెరుగుదల ఉంటుంది. ఒక అధికారి ఈవిధంగా పేర్కొన్నారు, "తదుపరి 40-45 రోజుల్లో తుది ఛార్జ్ లు పెంచే నిర్ణయాన్ని ముందు మేము అందరి నుండి ఫీడ్ బ్యాక్ ను కోరుతున్నాం."

పెట్రోల్ లేదా డీజల్ ఆధారిత వాహనాల రిజిస్ట్రేషన్ మొత్తాలను పెంచటం కాకుండా, 15-సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న అన్ని వాహనాలను నిర్వీయం చేసే ప్రతిపాదనను కూడా భారత ప్రభుత్వం చూస్తోంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం గట్టిగా పావులు కదుపుతోంది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కూడా సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటోంది. వాస్తవంగా ఈ ప్రతిపాదన అమలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు పెంచడం పై ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది.