జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

దేశంలో వాహనాల విక్రయాలు నెలనెలా పడిపోతూ వస్తున్నాయి. తాజాగా జూన్‌ మాసం విక్రయాల్లోనూ భారీ తగ్గుదల నమోదైంది. జూన్‌లో మారుతీ సుజుకీ, హ్యుందారు, టాటా మోటార్స్‌, టయోటాతో సహా అన్ని ప్రధాన సంస్థల విక్రయాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం రండి..

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

జూన్ నెలకు సంబంధించిన కార్ల అమ్మకాల నివేదికను దేశంలోని వివిధ తయారీ పరిశ్రమలు విడుదల చేశారు. అమ్మకాల నివేదిక ప్రకారం భారత మార్కెట్లో అత్యధిక బ్రాండ్లు నుండి కార్ల అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. ఇది గత కొన్ని నెలలుగా ఇదే విధంగా ఉంది, ఇది వచ్చే నెలలలో కూడా కొనసాగ వచ్చు.

భారత మార్కెట్లో ఉన్న కొన్ని టాప్ బ్రాండ్లు జూన్ 2019 నెలలో అమ్మకాల గురించి ఇక్కడ తెలుసుకొందాం.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

మారుతి సుజుకి

మారుతి సుజుకి దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నది కూడా అయితే, ఈ బ్రాండ్ కూడా అమ్మకాల విషయంలో వెనకడుగు వేసింది. ఈ సంస్థ భారత మార్కెట్లో అమ్మకాల పరంగా తక్కువ నమోదు చేసింది. జూన్ 2019 మారుతి సుజుకి 1,11014 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

అయితే జూన్ 2018 లో 1,34036 యూనిట్ల అమ్మకాలతో ఉంది అంటే 17.2 శాతం క్షిణించింది. ఎగుమతి మార్కెట్ పరంగా చూస్తే మారుతి సుజుకి జూన్ 2018లో 9,319 యూనిట్ల అమ్మకాలు ఉండగా 5.7 శాతం వృద్ధితో గత నెలలో 9,847 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

మహీంద్రా అండ్ మహీంద్రా

జూన్ 2019 నెలలో దేశంలో కొంత వృద్ధిని నమోదు చేసిన బ్రాండ్లలో మహీంద్రా ఒకటిగా ఉంది. ఈ బ్రాండ్ 18,826 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలతో గత నెలలో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 18,137 యూనిట్ల అమ్మకాలు ఉన్నాయి. వీరి అమ్మకాలలో పెరుగుదల ముఖ్య కారణం మార్కెట్ లో మూడు కొత్త ఉత్పత్తి వచ్చాయీ అవి ఎస్యూవి300, మారాజో మరియు ఆల్టురాస్ జి4 అని చెప్పవచ్చు.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

జూన్ 2019 లో మార్కెట్ అమ్మకాల పై వ్యాఖ్యానిస్తూ, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్, ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ యొక్క చీఫ్, వీజయ్ రామ్ నక్రా ఈ విధంగా పేర్కొన్నారు," మహీంద్రా , ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో 4% వృద్ధిని నమోదు చేసుకోవడం మరియు ఇటీవల మన మూడు వాహనాలు లాంఛ్ అవ్వడంతో యుటిలిటీ వాహనాల సెగ్మెంట్ లో 8% వృద్ధి నమోదకావడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్కి కూడా జూన్ 2019 నెలలో అమ్మకాల తగ్గాయి, ఇండియన్ మార్కెట్లో తమ వెన్యూ ఎస్యువి లాంచ్ అయినప్పటికీ, ఈ కొరియా బ్రాండ్ దేశీయ మార్కెట్లో 7.3 శాతం క్షిణించింది, గతనెల 42,007 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకొంది.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

జూన్ 2018 లో 15,408 యూనిట్ల అమ్మగా గత నెలలో 16,800 యూనిట్లతో ఎగుమతి అమ్మకాల్లో మెరుగుదల పొందింది. వీటి ఎగుమతుల వలన 9 శాతం వృద్ధి సాధించింది. క్యుమిలేటివ్ సేల్స్ (దేశీయ + ఎగుమతి) పరంగా హ్యుందాయ్ 3 శాతం నష్టాన్ని నమోదు చేయగా, జూన్ 2019 లో మొత్తంగా 58,807 యూనిట్లు అమ్ముడయ్యాయి.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

టయోటా కిర్లోస్కర్ మోటార్స్

ఈ జపాన్ కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 13,088 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగా గత నెలలో కంపెనీ 10,603 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. టయోటా ఎటియోస్ ఉత్పత్తిని ఎగుమతి చేయడంలో జూన్ 2019 లో 762 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ విభాగంలో కూడా జూన్ 2018 లో 1,014 యూనిట్లను అమ్మింది.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

అమ్మకాల పై వ్యాఖ్యానిస్తూ, టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. రాజా ఇలా పేర్కొన్నారు:

పరిశ్రమ బలహీనమైన వినియోగదారుల సెంటిమెంటుకు దోహదం చేసిన అనేక కారకాల కారణంగా దేశీయ అమ్మకాల నిరంతర తగ్గాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ వ్యయాలు, ద్రవ్యత్వం మరియు కొన్ని నెలల్లో అమలుకానున్న బిఎస్-6 వంటి కారణాలు కూడా పరిగణించాలి. ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఎదుగుదల అవసరాన్ని పరిష్కరించడానికి రాబోయే బడ్జెట్ గురించి మేం ఎదురుచూస్తున్నాం, దీని ఫలితంగా ఆటో పరిశ్రమలో మరింత మెరుగైన అమ్మకాలు ఉంటాయి.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హోండా కార్స్ ఇండియా

హోండా కార్స్ ఇండియా జూన్ 2019 నెలలో అమ్మకాల పరంగా ఇతర బ్రాండ్లకు భిన్నంగా లేదు. గత నెలలో ఈ బ్రాండ్ అమ్మకాల తగ్గడం జరిగింది. ఈ కంపెనీ జూన్ 2018 లో 17,602 యూనిట్ల అమ్మకాలు ఉండగా, జూన్ 2019 లో 10,314 యూనిట్లు అమ్మకాలతో 41 శాతం తగ్గుదల నమోదు చేసింది.

జూన్ నెల ఫోర్ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ రాజేష్ గోయెల్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ విధంగా పేర్కొన్నారు: ఆటో పరిశ్రమ అనేక నెలలుగా క్షిణిస్తోంది, చెత్త అమ్మకాల గుండా వెళుతోంది. ముందుకు సాగడానికి, డిమాండ్ ని తగ్గించగల ఏదైనా చొరవ పరిశ్రమకు తప్పకుండా సానుకూలతను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
The car sales report for the month of June 2019 has been released by various manufacturers in the country.
Story first published: Tuesday, July 2, 2019, 15:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X