కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, అంతేకాకుండా అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇక్కడనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వాహనాలను కొనుక్కోవడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. దీనివలన మన దేశంలో కాలుష్యం ఎంతగా ఉందంటే ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

దీనిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గాలను అన్వేషిస్తోంది. అందులోని భాగంగానే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేపనిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం 2023 కల్లా దేశంలో దాదాపు అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ గా ఉండాలని షరతులను పెట్టింది. అయితే ఇటీవల ఒక ముఖ్యమంత్రి ఈ నిబంధనలను పాటించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎవరా సీఎం, అయన ఏమి చేసాడో వివరంగా తెలుసుకొందాం రండి...

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం తన నివాసం నుండి ఎలక్ట్రిక్ కారులో రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. " అయితే రాష్ట్రంలో కాలుష్య సమస్య పెరుగుతోందని, దానికి మనం వ్యతిరేకం అని, ఒక సందేశాన్ని వ్యాప్తి చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తున్నారు.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

ఈవిధంగా ఒక ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ కారును ఉపయోగించడం వలన రాష్ట్ర ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి మరింత ప్రోత్సహిస్తుంది," అని రవాణా డిపార్ట్ మెంట్ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

రాష్ట్రంలో స్థానిక స్థలాలను సందర్శించే సమయంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ కారును ఉపయోగించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇది కాలుష్య రహిత కారు, ఇది రాష్ట్రంలో కాలుష్య స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

"ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపించి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కూడా అందిస్తోంది. విద్యుత్ కార్లను కొనుగోలు చేసిన తరువాత వినియోగదారులకు ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తుంది, "అని ఆయన తెలిపారు.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

ఈ కారు నాలుగు గంటల పాటు చార్జింగ్ చేసిన తర్వాత 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని, దీని ద్వారా ప్రభుత్వం డిసి చార్జర్ ను అందిస్తుదని, దీని ద్వారా కారు 45 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని ఆయన తెలిపారు.

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

గణేష్ కుమార్, కార్ డ్రైవర్ మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుతూ, " ఈ ఎలక్ట్రిక్ కారు సౌండ్ లెస్ మరియు తేలికగా డ్రైవింగ్ చేయవచ్చు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది వాతావరణాన్ని కలుషితం చేయదు, ఇది అత్యుత్తమ ఫీచర్ అని తను చెప్పాడు."

కొత్త ఎలక్ట్రిక్ కారును మొట్టమొదటగా ఉపయోగించిన సీఎం!

అయితే ఈ ఎలక్ట్రిక్ కారును ఉపయోగించడం ద్వారా కిలోమీటర్ కు 80 పైసలు ఖర్చు మాత్రమే అవుతుంది, ఇది ఇతర ఇంధన వాహనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Bihar CM Nitish Kumar reaches state assembly in electric car - Read in Telugu.
Story first published: Friday, July 26, 2019, 14:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X