మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు.... నగరంలో స్వీట్లు పంపిణీ

ప్రస్తుత సమాజంలో ప్రజలు మరియు జంతువుల పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఇందుకు భిన్నంగా కర్ణాటకకు చెందిన ఒక తండ్రి మరియు కొడుకులు వారి యొక్క మహీంద్రా సిజె3బి కి 50 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపి నగరం మొత్తం స్వీట్లు పంచిపెట్టారు. ఈజీప్ ని కలియున్న ముండోడి కుటుంబం వారి యొక్క యూట్యూబ్ ఛానల్ అయిన ముండోడి వ్లాగ్స్‌లో జీప్ యొక్క పుట్టినరోజు వేడుకల వీడియోలను అప్‌లోడ్ చేశారు.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు... నగరంలో స్వీట్లు పంపిణీ

యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వాహనాన్ని పరిచయం చేయడంతో మొదలవుతుంది. మహీంద్రా సిజె3బి జీప్ వారి కుటుంబంలో దాదాపు 50 సంవత్సరాలుగా ఉంది. ఈ జీప్ ను 1969 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్పటినుంచి అది వారికుటుంబంతో పాటు ఉంది.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు... నగరంలో స్వీట్లు పంపిణీ

మహీంద్రా జీప్ యొక్క పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తండ్రి కొడుకులు వాహనాన్ని సమీప గ్రామానికి తీసుకెళ్లి అక్కడ గ్రామస్థులందరికి స్వీట్లు పంచిపెట్టారు. కొన్ని వార్తాపత్రికలు అందించిన నివేదికలప్రకారం ఆ జీప్ ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండటానికి ఆ కుటుంబంలోని వారు చాలా కష్టపడ్డారని తెలియజేసింది.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు... నగరంలో స్వీట్లు పంపిణీ

కొన్నిసంవత్సరాల క్రితమే వారు జీప్ యొక్క బాడీ మొత్తానికి 16-గేజ్ మెటల్ షీట్ ను అమర్చారు. ఎరుపు రంగు జీప్ కున్న అసలైనది రంగు కాదు, తరువాత కాలంలో తిరిగి పెయింట్ వేశారు.అంతే కాకుండా చక్రాలు కూడా మార్చ బడ్డాయి, ఈ చక్రాలు 6-స్పోక్ అల్లాయ్ వీల్ ని కలిగి ఉంది.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు... నగరంలో స్వీట్లు పంపిణీ

CJ 3B సరైన 4 × 4 SUV ను కలిగి ఎలాంటి రోడ్ లో అయినా వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుంది. జీప్‌లో 3-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటు అధిక మరియు తక్కువ నిష్పత్తి గల గేర్‌బాక్స్‌లను కూడా కలిగి ఉంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, 1990 లో జీప్ యొక్క పెట్రోల్ ఇంజిన్ స్థానంలో హై స్పీడ్ డైరెక్ట్ ఇంజన్ వచ్చింది అని తెలుస్తుంది.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు.... నగరంలో స్వీట్లు పంపిణీ

మహీంద్రా యుటిలిటీ వాహనాలను తయారు చేయడంలో బాగా ప్రావీణ్యం కలిగి, యుటిటేరియన్ వాహనాలను తయారు చేయడంపై ద్రుష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు మహీంద్రా దేశంలోనే అతిపెద్ద యుటిలిటేరియన్ వాహనాల తయారీదారుగా కీర్తి గడించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా మహీంద్రా కూడా కొత్తమార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మహీంద్రా తరువాతి తరంలో ఉపయోగించే వాహనాలను తయారు చేయడమే కాకుండా వాటికి రోడ్లలో చాలాసార్లు పరీక్షలు నిర్వహించింది.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు.... నగరంలో స్వీట్లు పంపిణీ

ఢిల్లీలో జరిగబోయే 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా కొత్త థార్ ని చూడబోతున్నాము. థార్ తో పాటు మహీంద్రా తరువాతి తరం అయిన స్కార్పియో మరియు ఎక్స్‌యువి 500లతో కలసి పనిచేస్తుంది. రాబోయే అన్నివాహనాలు కొత్త ప్లాట్‌ఫాంపైనే ఆధారపడి ఇప్పుడున్న తరం కంటే కూడా బాగా విస్తృతంగా ఉండబోతున్నాయి.

మహీంద్రా జీప్ 50 వ పుట్టినరోజు జరిపిన తండ్రి, కొడుకులు.... నగరంలో స్వీట్లు పంపిణీ

ప్రస్తుతమున్న వెర్షన్ కంటే 2020 మహీంద్రా థార్ అనేది చాల ఖరీదైనదిగా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో శక్తివంతమైన ఇంజిన్లు ఉంటాయి. అదనంగా ఎక్కువ భద్రతా లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా రైడ్ కి మరింత సౌకర్యంగా ఉంటుంది. భద్రతా లక్షణాలు ఎక్కువ ఉండటం వాల్ల ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా ఈ కొత్త తరం వాహనాన్ని విడుదల చేయబోతోంది.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2019, 11:29 [IST]
English summary
Man & son celebrate 50th birthday of Mahindra Jeep CJ3B: Distribute sweets to entire town [Video]-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+